నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ! మిమ్మల్ని హత్యలు చేస్తరు, మానభంగాలు చేస్తరు, నడిరోడ్లో కొడతారు, కానీ మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ రారు. మీరు నినాదాలు చేసినా? మీ సంఘం తరఫున ఫిర్యాదులు చేసినా? బందుకు పిలుపునిచ్చినా? ప్రభుత్వం మరియు పరిపాలన నీ మాట వినదు. మీ పై దాడులు చేసిన వారిని అరెస్టు చేస్తారు, తర్వాతైనా న్యాయం జరుగుతుందా? ప్రశ్న న్యాయం గురించి కాదు, ప్రశ్న ఈ దాడులు మీ మహిళల మీదనే ఎందుకు జరుగుతున్నాయి/ జరుగుతాయి? ఎందుకంటే మీరు పాలకులు కాదు. ఎలక్షన్లలో మీ కులం వాళ్ళే వివిధ అగ్ర వర్ణ /కుల పార్టీలకు అమ్ముడు పోతారు. అమ్ముడు పోయిన వాళ్లను మీ నాయకుడిగా అనుకుని తన్నులు తింటూ ఉంటారు/ ఉన్నారు. మీ పైన జరిగే అత్యాచారాల గురించి ఏ ఒక్క నాయకుడైనా వాళ్ళ పార్టీ ఆదేశాలను కాదని ఒక్క మాటైనా మాట్లాడతారా? ఎంత మంది నాయకులు సమాజహితం కోసం వాళ్ళ పార్టీలు వదిలి పని చేస్తున్నారు? అంటే వాళ్లకు సమాజహితం కంటే ఆయా పార్టీలు, పదవులే ముఖ్యం. మన జనాలకి ఇలాంటి నాయకులు ఉన్నన్ని రోజులు మనపై ఇలాంటి దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. మీరు పాలకులు కావాలి ఎందుకంటే పాలకులపైన ఎప్పుడు కూడా అత్యాచారాలు జరగవు. ...