ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు రాసిన ఈ వాస్తవాలను తప్పక చదవండి.. 🙏🙏 ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్,ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను? నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను.బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను.మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు.రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే. మత మార్పిడులు జరగకుండా హిందూ మత...