By T Chiranjeevulu IAS Ret ప్రైవేటీకరణ పుణ్యమా అని గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందిస్తామని చెప్పినప్పటికీ, “సోషల్, సెక్యులర్, డెమొక్రటిక్ రిపబ్లిక్”గా అభివృద్ధి చెందాల్సిన భారతదేశంలో కొందరికి మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మిగతావారు ప్రభుత్వ సబ్సిడీలపై బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హురున్ ఇండియా 2025 రిపోర్ట్ - ఆర్థిక అసమానతలు భారతదేశంలో 284 మంది బిలియన్ డాలర్ సంపద గల వ్యక్తుల చేతిలో ₹98 లక్షల కోట్ల సంపద కేంద్రీకృతమైంది. ఇది దేశ జీడీపీలో మూడవ వంతు. తెలంగాణ రాష్ట్రం బిలియనీర్ల సంఖ్యలో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 18 మంది బిలియనీర్లు ఉన్నారు, కానీ వీరిలో ఒక్కరూ బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలకు చెందినవారు కాదు. తెలంగాణ బిలియనీర్ల జాబితా ఈ 18 మంది కుబేరుల జాబితా మరియు వారి కులం ఈ క్రింది విధంగా ఉంది: దివి మురళి (దివిస్ లాబ్స్) – $10 బిలియన్లు – కమ్మ పి. పిచ్చి రెడ్డి – $5.8 బిలియన్లు – రెడ్డి టీవీ కృష్ణారెడ్డి (MEIL) – $5.6 బిలియన్లు – రెడ్డి ప్రతాప్ సి రెడ్డి (అ...