Dr. Tirunahari Seshu The local body elections held for the first time in Telangana in 2019 were marred by controversies, and the upcoming second round of local elections is also turning controversial. Notably, the reason for the controversies in both instances is the issue of BC (Backward Classes) reservations. Despite the legal ambiguity surrounding BC reservations, the government has issued G.O. No. 9, providing 42% reservations for BCs and preparing for local elections starting October 9. However, with court cases pending, there is widespread discussion across political circles in the state about whether the elections will proceed and what the court’s verdict on the reservation issue will be. The government is determined to conduct elections for 12,760 gram panchayats, 5,763 MPTCs, and 565 ZPTCs, but doubts persist about how it can hold elections without resolving the BC reservation issue. It is worth noting that states like Maharashtra and Madhya Pradesh have also been unable to co...
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాల మధ్యనే జరిగితే రెండవ పర్యాయం జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వివాదాస్పదంగానే మారుతున్నాయి. రెండుసార్లు వివాదాలకు కారణం బీసీ రిజర్వేషన్లే కావడం గమనారహం. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినా ప్రభుత్వం మాత్రం బీసీలకి జీవో నెంబర్.9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అక్టోబర్ 9 నుండి స్థానిక ఎన్నికలకి సిద్ధపడటంతో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చినే జరుగుతుంది. 12,760 గ్రామపంచాయతీలకి 5763 ఎంపీటీసీ లకి 565 జడ్పిటిసి లకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పట్టుదలగా ముందుకెళుతున్నప్పటికీ బీసీల రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి రాకుండా ప్రభుత్వం ఎలా ఎన్నికలను నిర్వహించగలుగుతుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకపోవడం వలన ఎన్నికలు నిర్వహించలేకపోయాయనే విషయా...