Skip to main content

A Weapon for the BC Political Power Struggle

Original article published in Telugu Prabha,  Translated into English.
— Dr. Sangishetty Srinivas, Social and Political Analyst.

For the past 75 years, dominant castes have held sway in Telangana's politics. Since 1952, many leaders have fought to dismantle this dominance to the best of their abilities. However, the leaders of these dominant castes have continuously adapted their strategies to retain political power. To counter these tactics, the Backward Classes (BCs) must become aware and empowered. Awareness means being able to refute deceptive rhetoric with facts and figures. The injustices faced by BCs in all sectors must be proven. Every lie propagated must be countered with truth. The deceitful claims of governments must be exposed with reasoned arguments. As part of this effort, retired IAS officer T. Chiranjeevulu has meticulously documented how misleading narratives, manipulative strategies, caste dominance, and nepotism have systematically deprived BCs of political power. He has fulfilled his responsibility as an intellectual.

On behalf of the BC Intellectual Forum, last Sunday, the book Hissa, Izzat, Hukumat (Share, Dignity, Power) was unveiled among prominent BC leaders. In this book, Chiranjeevulu has detailed every issue with evidence and statistics. It would be simplistic to assume that, as a retired IAS officer, he easily gathered information through his connections. The government often conceals crucial data. Chiranjeevulu collected such data through the Right to Information Act and compiled it in this book. He also utilized data announced by ministers in parliamentary sessions for his analysis. Additionally, he gathered information from government diaries and websites of various institutions. Thus, nearly 100% of the information in the book is reliable and authoritative. A deep analysis of this credible data could be shocking for BCs. It reveals how dominant castes have plundered resources and reduced BCs to mere vote banks in electoral politics. The book exposes how ruling castes have maintained dominance in water, funds, and appointments.

In the chapter titled Hissa (Share), the book demonstrates, with statistics, how dominant castes have maintained control across 25 sectors and how BCs have been systematically marginalized. Due to space constraints, we will focus on the four pillars of Ambedkar’s democracy—judiciary, legislature, executive, and media.

Between 1952 and 2023, Telangana held 16 assembly elections, with a total of 1,741 assembly seats contested. Based on their population share, BCs should have won 847 seats, but they secured only 277, resulting in a loss of 570 seats. Meanwhile, the Reddy community, with a population share of 4.06%, won 578 seats (33% of the total). The Velama community, with just 0.28% of the population, secured 148 seats (8.56%). Similarly, communities with smaller populations, such as Kammas (73 seats), Brahmins (127 seats), and Vaishyas (22 seats), were elected as MLAs. In contrast, the Mudiraj community, with a 6.68% population share, won only 29 seats (1.66%). Many castes, including Vaddera, Kummari, and Nayi Brahmin, have yet to secure a single assembly seat. The book also warns that women’s reservations could further reduce BC representation.

In the judiciary, over the past 75 years, only three BCs have served as Chief Justices in the Hyderabad/Andhra Pradesh/Telangana High Courts, two of whom were from other states. The only BC Chief Justice from Telangana was Justice Kumarayya (1909–2005) from Karimnagar, belonging to the Kummari caste, appointed as a judge during the Nizam’s rule. In contrast, 13 Brahmins, five Reddys, two Kammas, and 19 OCs from other states have held this position.

Between 1950 and 2022, seven Reddys, three Kammas, two Brahmins, and four others—16 in total—were promoted to Supreme Court judges from the Hyderabad, Andhra Pradesh, and Telangana High Courts. Not a single BC, SC, or ST was included. Of the 204 High Court judges appointed, 50 were Brahmins, 37 Reddys, 21 Kammas, and only 32 BCs. To address this discrimination, Chiranjeevulu suggests replacing the collegium system with an independent judicial commission to ensure transparent and socially inclusive appointments.

Discrimination in the executive (civil services) is equally severe. Despite 27% OBC reservations in civil services for the past 30 years, and some OBCs securing jobs in the open category, their representation in IAS, IPS, and IFS roles is only 14–16%. Since 1993, privatization has led to many public sector institutions being privatized. In central government jobs, BCs hold only 18.07% of Group A posts, 17.46% of Group B posts, 22.69% of Group C (clerical and subordinate) posts, and 17.89% of Group D (e.g., sweepers) posts, as per the 30th OBC Report tabled in Parliament on February 8, 2024. Only five BCs serve as Vice-Chancellors across 45 central universities, as confirmed by a minister’s response in the Lok Sabha. The book highlights injustices faced by BCs in education and employment.

In the media, considered the fourth pillar of democracy, dominant castes shape narratives to their advantage. Media outlets often spread false stories and allegations against BC leaders, undermining their credibility. This propaganda leads BC voters to undervalue their own leaders, impacting their electoral participation and success. Media ownership is largely controlled by Kamma, Velama, and Reddy communities, with only Surya newspaper under BC ownership. To counter mainstream media’s injustices, BCs must actively use social media to spread the truth and mobilize for political power.

The book also details how the Telangana government has marginalized BCs in nominated posts. Of the 58 chairpersons appointed by the Revanth government to corporations and authorities, 33 are Reddys, while only 11 are BCs, mostly heading caste-based finance corporations. Chiranjeevulu points out that while Rahul Gandhi highlights the absence of BCs in the Prime Minister’s Office, Revanth Reddy’s office similarly lacks BC representation.

Over the past 11 years, budgets totaling ₹20.69 lakh crore were allocated, of which ₹18.17 lakh crore was spent. BCs were allocated ₹65,546.24 crore, but only ₹28,713 crore was spent. The book provides data showing BCs’ lack of share in 25 sectors, including education, medical, pharmaceuticals, real estate, banking, contracts, cement, liquor, gold, poultry, IT, rice mills, and edible oils.

The Congress Party’s promise of 42% BC reservations in local bodies is mere propaganda, as they know it won’t hold up in court. The antidote to this drama is Hissa, Izzat, Hukumat—mobilizing every BC voter in every village. BCs must recognize the injustices they face and act with resolve. On the occasion of Dasara, this book serves as a weapon for the BC struggle for political power.


Telugu Version

#సంచకారి
 
బీసీ రాజ్యాధికార పోరాటానికి ఆయుధం 

తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్యకులాల వారి అజమాయిషీ గత 75 ఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ ఆధిపత్యాన్ని కూలదోసేందుకు 1952 మొదలు ఇప్పటి వరకు అనేక మంది నాయకులు తమ శక్తిమేరకు పోరాటం చేసిండ్రు. అయితే ఆధిపత్యకుల నాయకులు ఎప్పటికప్పుడు తమ ఎత్తుగడల్లో మార్పులు చేసుకుంటూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ ఎత్తుగడలను చిత్తు చేయాలంటే బీసీలు చైతన్యం కావాలి. చైతన్యం కావడమంటే ఇన్నేండ్లు ప్రచారంలో ఉన్నటువంటి మాయ మాటలను అంకెలతో తిప్పికొట్టగలగాలి. అన్ని రంగాల్లో బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరూపించాలి. ప్రచారంలో ఉన్న ప్రతి అబద్ధాన్ని సత్యంతో ఎదిరించాలి. ప్రభుత్వాల మోసపూరిత ప్రకటనల్లోని డొల్ల తనాన్ని వాదనా పటిమతో దిగదుడుపు చేయాలి. అందులో భాగంగానే మాయమాటలు, మోసపు వ్యూహాలు, కులాధిపత్యం, బంధుప్రీతి అన్నీ కలగలిపి బీసీలను రాజ్యాధికారం నుంచి ఎట్లా వంచితుల్ని చేస్తున్నదో లెక్కగట్టి చెప్పిండు రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి టి.చిరంజీవులు సారు. ఇంటలెక్చువల్ గా తన బాధ్యతను నిర్వర్తించాడు.

బిసి ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ తరపున మొన్న ఆదివారం నాడు బిసి అతిరథ మహారథుల మధ్యన ఆవిష్కృతమైన ‘ఇస్సా ఇజ్జత్‌ హుకుమత్‌’ (వాటా, ఆత్మగౌరవం, అధికారం) అనే గ్రంథంలో ప్రతి అంశాన్ని, ఆధారాలతో, అంకెలతో సహా సార్ విడమరిచి చెప్పిండు. ఒక ఐఎఎస్‌ అధికారిగా రిటైరై తనకున్న సంబంధాలతో ఈజీగానే సమాచారం సేకరించాడని భావించడానికి వీలులేదు. ప్రభుత్వం చాలా లెక్కలను దాచి పెడుతుంది. ఇట్లాంటి లెక్కలన్నింటినీ సమాచార హక్కుద్వారా సేకరించి ఇందులో క్రోడీకరించిండు. అంతేగాదు పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు ప్రకటించిన డేటాను తన విశ్లేషణకు ఉపయోగించుకున్నాడు. అంతేగాకుండా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు విడుదల చేసిన డైరీలు, ఆయా సంస్థల వెబ్‌సైట్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఇందులో జోడించాడు. అంటే దాదాపు వందకు వందశాతం ఇందులోని సమాచారం విశ్వసనీయమైనది. సాధికారికమైనది. ఈ సాధికారికమైన సమాచారాన్ని లోతుగా విశ్లేషిస్తే బీసీల గుండెలు ఆగిపోయే ప్రమాదమున్నది. ఇన్నేండ్లు ఆధిపత్య కులాల వారు ఎట్లా దోచుకున్నారు, బీసీలను ఓట్ల రాజకీయంలో ఎట్లా యాచకుల స్థాయికి దిగజార్చిండ్రో అర్థమవుతుంది. నీళ్లు, నిధులు, నియమాకాలు అన్నింటిలో పాలక కులాల ఆధిపత్యం కొనసాగిన తీరు తెలుస్తుంది.
 
ఇస్సా (వాటా) అనే అధ్యాయంలో మొత్తం 25 రంగాల్లో ఆధిపత్యకులాల వారి అజమాయిషీ ఎట్లా కొనసాగుతున్నది. బీసీలు ఏ విధంగా వంచనకు గురవుతున్నారు అనే అంశాన్ని లెక్కలతో సహా నిరూపించారు. అయితే స్థలాభావం వల్ల ఇక్కడ అంబేడ్కర్‌ ప్రజాస్వామ్యానికి పునాదులుగా చెప్పినటువంటి జ్యుడిషియరీ, లెజిస్లేటివ్‌, ఎగ్జిగ్యూటివ్‌, మీడియా గురించి మాత్రం చర్చించుకుందాం. 

1952-2023 మధ్య కాలములో మొత్తం 16 సార్లు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1741 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీసీలు జనాభా దామాషా మేరకు తమ వాటాగా 847 సీట్లు గెలవాల్సి ఉండింది. కానీ కేవలం 277 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే బీసీలు నష్టపోయిన సీట్లు 570. తెలంగాణలో రెడ్ల జనాభా 4.06 శాతముండగా వాళ్లు 33శాతం అసెంబ్లీ స్థానాలు అంటే 578 సీట్లు గెలుచుకున్నారు. అట్లాగే వెలమల జనాభా శాతం 0.28 ఉండగా వారు గెలిచిన సీట్లు 148. ఇది 8.56 శాతానికి సమానం. ఆదే సమయంలో అత్యల్ప జనాభా ఉన్న కమ్మలు 73, బ్రాహ్మణులు 127, వైశ్యులు 22 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయిండ్రు. అదే సమయంలో జనాభాలో 6.68 శాతమున్న ముదిరాజులు కేవలం 29 సీట్లు అంటే 1.66 శాతం మాత్రమే గెలుపొందారు. వడ్డెర, కుమ్మరి, నాయి బ్రాహ్మణ వంటి అనేక కులాలు ఇప్పటికీ అసెంబ్లీ గడప దొక్కలేదని కూడా చెప్పిండు. మహిళల రిజర్వేషన్ అమలయితే ఈ ప్రాతినిధ్యం మరింతగా దిగజారానున్నదని విశ్లేషించారు. 

ఇక న్యాయవ్యవస్థ విషయానికి వస్తే ఇప్పటి వరకు హైదరాబాద్‌/ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ హైకోర్టుల్లో 75 యేండ్లల్లో మొత్తం 42 మందిలో ముగ్గురంటే ముగ్గురు బీసీలు మాత్రమే చీఫ్‌ జస్టిస్‌లుగా పనిచేశారు. అందులో ఇద్దరు ఇతర రాష్ట్రాల వారు కాగా తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్క బీసీ మాత్రమే చీఫ్‌ జస్టిస్‌ అయ్యిండు. ఆయన జస్టిస్‌ కూమరయ్య (1909-2005) కరీంనగర్‌ జిల్లా కుమ్మరి కులానికి చెందిన ఈయన నిజాం ప్రభుత్వంలో జడ్జ్‌గా నియమితుడయ్యిండని గుర్తుంచుకోవాలి. ఇందులో 13 మంది బ్రాహ్మణులు, ఐదుగురు రెడ్లు, ఇద్దరు కమ్మలు, ఇతర రాష్ట్రాల ఓసీలు 19 మంది ఉన్నారు.

1950-2022 మధ్య కాలంలో హైదరాబాద్‌ స్టేట్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టుల నుంచి ఏడుగురు రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఇద్దరు బ్రాహ్మణులు, ఇతరులు నలుగురు అంటే మొత్తంగా 16 మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్‌ అయ్యిండ్రు. ఇందులో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీ,ఎస్సీ, ఎస్టీ లేడు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులుగా మొత్తం 204 మంది నియమితులైతే అందులో 50 మంది బ్రాహ్మణులున్నారు. రెడ్లు 37, కమ్మలు 21 మంది ఉన్నారు. అయితే బీసీలు కేవలం 32 మంది మాత్రమే ఉన్నారు. ఈ వివక్ష రద్దు కావాలంటే కొలీజియము వ్యవస్థకు బదులుగా స్వతంత్ర జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి అన్ని నియామకాలను పారదర్శకంగా, సామాజిక న్యాయ సమ్మిళితంగా నిర్వహించాలని చిరంజీవులు హితవు పలికారు.

ఎగ్జిగ్యూటివ్‌ (సివిల్‌సర్విసెస్‌) రంగంలో వివక్ష, అన్యాయం ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవ్వరూ ఊహించబోరు. ఎందుకంటే గత 30 ఏండ్లుగా ఈ సర్విసెస్‌లో 27శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు అమలవుతున్నాయి. మీదు మిక్కిలి ఎందరో కొందరు ఓపెన్‌ కోటాలో కూడా ఉద్యోగాలు సాధిస్తారు కాబట్టి కచ్చితంగా ఓబీసీల ప్రాతినిధ్యం 30-40 శాతానికి మించి ఉంటుందని ఊహిస్తాము. అయితే ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లలో ఓబీసీ అధికారులు 14-16 శాతం మధ్య ఉన్నారని లెక్కలు తేల్చి చెప్పిండు. 1993 తర్వాత ప్రయివేటీకరణ శరవేగంగా సాగడంతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ‘ఎ’ కేటగిరీ ఉద్యోగాల్లో 18.07 శాతం, ‘బి’ కేటగిరీ ఉద్యోగాల్లో 17.46 శాతం, క్లర్క్‌, సబార్డినేట్‌ ఉద్యోగాలైన ‘సి’ గ్రూప్‌లో 22.69 శాతం, స్వీపర్ల లాంటి ‘డి’ కేటగిరీలో 17.89 శాతానికి మించి బీసీలు లేరు అని చెప్పిండు. ఈ వివరాలు ఫిబ్రవరి 8, 2024 నాడు పార్లమెంటు ప్రవేశపెట్టిన 30వ ఓబీసి రిపోర్టు ఆధారంగా పేర్కొన్నారు. అట్లాగే మొత్తం 45 సెంట్రల్‌ వర్సిటీల్లో కేవలం ఐదుగురు బీసీలు మాత్రమే వైస్‌చాన్సలర్‌లుగా ఉన్నారని లోక్‌సభలో మంత్రి ఇచ్చిన సమాధానం ఆధారంగా రికార్డు చేసిండు. బీసీలకు విద్యతో పాటు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలను ఈ పుస్తకంలో ఎత్తి చూపించిండు. 
ఇక మీడియా విషయానికి వస్తే ఇవ్వాళ ఆధిపత్య కులాల వారికి అనుగుణంగా కాన్సెంట్‌ని తయారు చేస్తున్నది ఈ రంగమే! ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా పేరొందిన ఈ మీడియా రంగం బీసీ నేతలపై కుట్రపూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తాయి. నిందలు మోపుతాయి. కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఆ వ్యక్తులకు క్రెడిబిలిటీ లేకుండా ఈ మీడియా సంస్థలు వ్యవహరిస్తాయి. ఇట్లా మీడియా చేసే దుష్ప్రచారం వల్ల బీసీ ఓటర్లే తమ నాయకులను తక్కువగా భావించే పరిస్థితి ఉన్నదని చెప్పిండు. ఇట్లాంటి ప్రచారం వల్ల బీసీలు ఎన్నికల్లో నిలబడటం, గెలవడంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. మీడియా యాజమాన్యాలు కమ్మ, వెలమ, రెడ్డి చేతుల్లో ఉందని, ఒక్క సూర్య పత్రిక తప్ప బీసీల యాజమాన్యంలో ఒక్క పత్రిక కూడా లేదు అని విశ్లేషించారు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా బీసీలకు చేస్తున్న అన్యాయాలను గట్టిగా ఎదుర్కోవాలంటే బీసీలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిజాలను ప్రచారంలో పెట్టాలని చెప్పిండు. బీసీలను సంఘటిత పరిచి రాజ్యాధికారం కోసం కొట్లాడాలె అని పిలుపునిచ్చారు.
ఇవే గాకుండా నామినేటెడ్‌ పోస్టుల్లో ఎట్లా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదో లెక్కల్లో చెప్పిండు. కార్పోరేషన్లు, అథారిటీల చైర్మన్లుగా మొత్తం 58 మందిని రేవంత్‌ సర్కారు నామినేట్‌ చేసింది. ఇందులో 33 మంది రెడ్లున్నారు. 11 మంది బీసీలున్నారు. ఈ బీసీలు సైతం ఎక్కువగా కుల సంఘాల ఫైనాన్స్‌ కార్పోరేషన్ల చైర్మన్లుగా ఉన్నారు. అంటే నామినేటెడ్‌ పదవుల్లోనూ ఈ అన్యాయం కొనసాగుతున్నది. ఒక వైపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కార్యాలయంలో బీసీలు లేరు అని చెబుతున్నారు. అదే సమయంలో రేవంతు కార్యాలయంలో కూడా బీసీలు లేరు అనే విషయాన్ని ఆయన పట్టించుకోవాలని చిరంజీవులు చెప్పారు. 
వీటికి తోడుగా గత 11 ఏండ్ల బడ్జెట్‌లలో మొత్తం 20.69 లక్షల కోట్టు కేటాయించగా అందులో 18.17 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇందులో బీసీలకు కేటాయించినవి 65,546.24 కోట్లు. కానీ ఖర్చు చేసింది 28,713 కోట్లు. ఇట్లా అడుగడుగునా బీసీలకు విద్య, మెడికల్‌, ఫార్మాస్యూటికల్‌, రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌, కాంట్రాక్టులు, సిమెంట్‌ పరిశ్రమ, మద్యం, బంగారం మార్కెట్‌, పౌల్ట్రీ, ఐటి పరిశ్రమ, రైసు మిల్లుల, తినే నూనెలు ఇట్లా మొత్తం 25 రంగాల్లో బీసీలకు ఎలాంటి వాటా లేకపోవడాన్ని అంకెల్లో చూపించిండు. 

కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడల్లో భాగంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అని ప్రచారం చేస్తున్నది. ఈ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి రాబోవు అని వారికి తెలుసు కాబట్టే ఈ నాటకం ఆడుతున్నారు. కోర్టులో ఈ కేసు నిలువదు అని తెలిసే డ్రామాలాడుతున్నారు.  ఈ డ్రామాలకు విరుగుడు ‘ఇస్సా, ఇజ్జత్‌, హుకుమత్‌’ అంటూ గ్రామ గ్రామాన ప్రతి బీసీ ఓటరును చైతన్య పరచడమే. బీసీలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి సోయితో వ్యవహరించడమే ఇప్పటి అవసరం. దసరా సందర్బంగా బీసీ రాజ్యాధికార పోరాటానికి అందిస్తున్న ఆయుధం ఈ పుస్తకం. 
 
— డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

Comments

Popular posts from this blog

Unveiling the "Real Majority" of India

Unveiling the "Real Majority": Divya Dwivedi’s Critique of the Hindu Majority Narrative * In contemporary Indian discourse, the notion of a "Hindu majority" is often taken as an unassailable fact, with official statistics frequently citing approximately 80% of India’s population as Hindu. This framing shapes political campaigns, cultural narratives, and even national identity. However, philosopher and professor at IIT Delhi, Divya Dwivedi, challenges this narrative in her provocative and incisive work, arguing that the "Hindu majority" is a constructed myth that obscures the true social composition of India. For Dwivedi, the "real majority" comprises the lower-caste communities—historically marginalized and oppressed under the caste system—who form the numerical and social backbone of the nation. Her critique, developed in collaboration with philosopher Shaj Mohan, offers a radical rethinking of Indian society, exposing the mechanisms of power t...

Mallanna Unleashes TRP: A New Dawn for Marginalized Voices in Telangana's Power Game

On September 17, 2025, Chintapandu Naveen Kumar, popularly known as Teenmar Mallanna—a prominent Telugu journalist, YouTuber, and former Congress MLC—launched the Telangana Rajyadhikara Party (TRP) in Hyderabad at the Taj Krishna Hotel. The event, attended by Backward Classes (BC) intellectuals, former bureaucrats, and community leaders, marked a significant moment for marginalized groups in Telangana. Mallanna, suspended from Congress in March 2025 for anti-party activities (including criticizing and burning the state's caste survey report), positioned TRP as a dedicated platform for BCs, Scheduled Castes (SCs), Scheduled Tribes (STs), minorities, and the economically weaker sections. The party's vision emphasizes "Samajika Telangana" (a socially just Telangana) free from fear, hunger, corruption, and prejudice, with a focus on inclusive development and responsible governance. Key highlights from the launch: Symbolism : The date coincided with Periyar Jayanti and V...

Raise of RSS-affiliated think tanks

Since 2014, the number of think tanks affiliated with the Rashtriya Swayamsevak Sangh (RSS) and the Bharatiya Janata Party (BJP) has significantly increased. India had 192 think tanks in 2014, which surged to 612 by 2021, reflecting a notable rise in nationalist-oriented institutions like the India Foundation and the Vivekananda International Foundation  This growth is part of a broader strategy to challenge leftist intellectual dominance and promote a "New India" ideology through policy research and public discourse. The main goals of RSS-affiliated think tanks include: Promoting Hindutva Ideology : They aim to spread the ideology of Hindutva to strengthen the Hindu community and uphold Indian culture and civilizational values Challenging Leftist Dominance : These think tanks seek to counter the intellectual hegemony of leftist ideologies in India, providing an alternative narrative in policy discourse Supporting Government Policies : They produce research and reports that s...