ఆంధ్ర జ్యోతి వ్యాసం: తొమ్మిదేళ్ల తెలంగాణా పాలనలో ప్రజాపక్షం ఎంత ? కన్నెగంటి రవి,రైతు స్వరాజ్య వేదిక , ఫోన్: 9912928422 (జూన్ 2 - తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) ---------------------------------------------------------------------------- 2014 జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన సాధారణ ప్రజలకు, ఉద్యమ శక్తులకు శుభాకాంక్షలు. మనసు నిండా అనేక ఆకాంక్షలు నింపుకుని , ఉద్యమించిన ప్రజలు తమ జీవితాలు బాగు పడతాయని అనేక కలలు కన్నారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వ పాలనా తీరు, ఎన్నికల హామీల అమలు, చట్టాల అమలు, ఆర్ధిక వ్యవస్థ పని తీరు, సామాజిక న్యాయం, సహజ వనరుల వినియోగం, ఉపాధి అవకాశాలు , పర్యావరణం లాంటి కీలకమైన తొమ్మిది అంశాలను పరిశీలించడం ద్వారా, తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనా స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత అధికార పార్టీ గత తొమ్మిదేళ్లలో పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రస్టు పట్టించింది. ఇతర పా...