భారత దేశంలో, సమసమాజ నిర్మాణం ఇంత కాలం ఎందుకు జరగ లేదు ? అది జరగడానికి ఇంకా ఏం కావాలి ? బీసీ కార్యాచరణ ఏమిటి ?
•• బీసీలకు నాయకత్వ "సమస్య" ఏమేరకు ఉంది ? సమిష్టి నాయకత్వం నేటి బీసీల పరిస్థితికిఎ అవసరం.
•• కులం ఎందుకు పోవాలి ?
•• అనేక సందర్భాల్లో బాధితులే ఎందుకు నిందితులు అవుతున్నారు ?
•• కుల వ్యవస్థలో, ఏ మేరకు ఏయే కులాలు ఇంకా నష్ట పోతున్నాయి ? ఎందు చేత ?
•• కుల వ్యవస్థ లో, ఏయే ఎ కులాలు, ఏమేరకు, ఎలా లబ్ధి పొందుతున్నాయి ?
•• అన్ని కులాల వారికి, దామాషా అవకాశాలు తక్కాలి అంటే, ఇంకా ఏమి జరగాలి ?
•• అత్యధిక సంఖ్యాకులైన బాధిత కులాలు, వర్గాలు అన్నీ "కులాన్ని పాటించక పోతే" కులం ఎందుకు నిలుస్తుంది ?
•• అంతర్గత ఐక్యత బీసీల్లో అవసరం అయినంత ఎందుకు లేకుండా పోతుంది ?
•• ఐక్యత లేకుండా బీసీలు రాజ్యాధికారం ఎలా సాధిస్తారు ?
•• బీసీ నాయకత్వం మధ్య నైనా, అంతర్గత ఐక్యత అవసరం లేదా ? వీరి మధ్య ఏకత్వం లేకుండా, శ్రేణుల ఏకత్వం ఎలా వీలవుతుంది ?
•• సమస్య బీసీల దే అయినపుడు, పరిష్కారానికి కృషి చేయవలసింది,ఎ బీసీలే కాక మరెవరిది ?
సమస్య బీసీలదే అయినప్పుడు దాని పరిష్కారానికి జరిగే ఉద్యమానికి, బీసీయేతరుల నాయకత్వం నడుస్తుందా ?
•• తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎందుకు ఏకం కాలేక పోతున్నారు ? ఏకం కాకుంటే, బీసీలకు రాజ్యాధికారం వీలు అవుతుందా ?
•• బీసీలకు రాజ్యాధికారం లేకుండా, వారికి దామాషా అవకాశాలు , అభివృద్ధి వీలు అవుతుందా ?
•• బీసీ మేధావులు, రచయితలు, ముఖ్యంగా పరిశోధనా కార్యక్రమాల్లో ఉంటున్న బీసీలు, అవసరం అయిన మేరకు, సాహిత్యాన్ని ఎందుకు సృష్టించ లేక పోతున్నారు ?
•• బీసీ సమస్యల పరిష్కారానికి, అవసరమైన స్థాయిలో ఎందుకు ప్రచారం జరగడం లేదు ?
•• బీసీ సమస్యలపైన, పరిష్కార మార్గాల పైన ప్రచారం కోసం, అవసరమైన స్థాయిలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను ఎందుకు సృష్టించు కోలేక పోతున్నారు ?
•• బీసీల సాధికారత సాధించు కోవడానికి, కార్యక్రమాల నిర్వహణకు, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోడానికి, అన్ని స్థాయిల్లో *"బీసీ దళ్"* నిర్మాణం జరగాలి.
-- కొండలరావు
16-8-2025
Comments
Post a Comment