బ్లూ ఇండియా పార్టీ ప్రెస్ నోట్
బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – బీసీ సమాజాన్ని అవమానపరిచిన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్‌ఎస్ పార్టీల వైఖరిని బ్లూ ఇండియా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 ను తీసుకొచ్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు జారీ చేసిన స్టే ఆదేశాలు బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం చేశాయి. ఈ తీర్పు వెనుక దాగి ఉన్న రాజకీయ పన్నాగాలపై బ్లూ ఇండియా పార్టీ ప్రజల ముందుకు తెస్తుంది.
కాంగ్రెస్, బీజేపీ, బిఆర్‌ఎస్ పార్టీలు పదే పదే బీసీలను ఓట్ల బానిసలుగా వాడుకుంటూ, ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇస్తూ, చివరికి చట్టపరమైన లోపాలు సృష్టించి న్యాయస్థానాల ద్వారా బీసీ హక్కులను అడ్డుకుంటున్నాయి. ఇవన్నీ ఆ పార్టీల అసలు స్వభావాన్ని బయటపెడుతున్నాయి.
50 శాతం క్యాపు సమస్య: సుప్రీంకోర్టులో ఈ క్యాపును సవాలు చేస్తూనే, అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అందువల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని 8 మంది ఎంపీలు ముందుకు వచ్చి పార్లమెంటు ఉభయ సభల్లో రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే బాధ్యత తీసుకోవాలి.
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బిజెపి కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటూ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకోవడం పూర్తిగా అన్యాయం. బీసీలకు న్యాయం చేయడం కోసం రెండు పార్టీలూ కలసి కృషి చేయకపోతే, అది వారిద్దరి మోసం మాత్రమేనని ప్రజల ముందు మేము బహిర్గతం చేస్తున్నాం.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల న్యాయమైన వాటా లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం అసాధ్యం. బ్లూ ఇండియా పార్టీ మాత్రం వార్డు మెంబర్ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు – ‘జనాభా దామాషా – హక్కుల ప్రాతినిధ్యం’ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుంది.
హైకోర్టు స్టే కారణంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కోల్పోవడం తక్షణమే సవరించబడాలి. ప్రభుత్వం పటిష్టమైన డేటా, కచ్చితమైన చట్టపరమైన వాదనలతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బీసీల హక్కులను సాధించాలి. అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభలో బిల్లు పెట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చే పోరాటాన్ని ఇంకొకపక్క కొనసాగిస్తూనే ఉండాలి లేకపోతే, బ్లూ ఇండియా పార్టీ ప్రజలతో కలిసి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించనుంది. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో ఓట్లు వేయించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ బీసీ ప్రధాని పేరుతో బీసీల ఓట్లు వేయించుకొని వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఈ పార్టీల పైన బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసే బాధ్యత ఉన్నదని లేనియెడల తీసి ప్రజలకు దగా చేసినట్లే అవుతున్న నీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10% 48 గంటల్లో ఉభయ సభలో ఆమోదింపజేసి దేశస్థాయిలో నేటికీ అమలు చేయబడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ 50 శాతం సీలింగ్ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నదన్నప్పుడు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయబడుతున్నాయి బీసీల రిజర్వేషన్లు వచ్చేసరికి ఎందుకు ఈ ఆటంకాలు వస్తున్నాయి ఒకే దేశం ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే రాజ్యాంగంలో కొలవబడుతున్నటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో కొన్ని వర్గాలకు ఒక న్యాయం ఇంకొన్ని సామాజిక వర్గాలకు ఇంకొక న్యాయమా ఇది సామాజిక అసమానతలను అన్యాయాలను సూచిస్తుంది .ఇది చాలా ప్రమాదగంటికలను మోగిస్తుంది అన్న విషయాన్ని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది .కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాల్సిందిగా బ్లూ ఇండియా పార్టీ హెచ్చరిస్తుంది.
బీసీల హక్కులు – మా పోరాట లక్ష్యం
జనాభాకు తగిన ప్రాతినిధ్యం – బ్లూ ఇండియా పార్టీ ఆజెండా
అధ్యక్షుడు :-
బొంగు ప్రసాద్ గౌడ్
బ్లూ ఇండియా పార్టీ
957 3374066.
Comments
Post a Comment