*"జాగో(మేలుకో) తెలంగాణ* ************************* *మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. యుద్ధ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరించాలి.* ********************************** *ప్రెస్ నోట్* : Date : 23-07-2033 మణిపూర్ రాష్ట్రం లో బీజేపీ పార్టీ మరియు బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం మెజారిటీ మైతీ ప్రజలను మతతత్వంతో ప్రేరేపిస్తూ మైనారిటీ గిరిజన కుకీలను హత్యాకాండ సాగిస్తున్నారు. కుకీ గిరిజన మహిళలపై మానభంగాలను భారీ ఎత్తున ప్రేరేపిస్తున్నారు. మానవ చరిత్ర లో హిట్లర్ కాలం నాటి దారుణాలను ఆధునిక యుగంలో మణిపూర్లో బిజెపి ప్రణాళిక బద్ధంగా ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మత విద్వేష ఎజెండాను కొనసాగిస్తుంది. వెళ్లడవుతున్న మణిపూర్ దారుణాలు కొన్ని మాత్రమే, వెల్లడి కాని వందల వేల ఘటనలు దాచబడుతున్నవి అనేకం. మణిపూర్ BJP ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ అమిత్ షా ల సూచనల మేరకు పోలీస్ అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ మారణ హోమాన్ని పట్టించుకోవడం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పకడ్బందీగా ఈ మారణ హోమాన్ని ప్రభుత్వం యంత్రాంగాలతో కలిసి సాగిస్తున్నాయి. మణిపూర్ లో ...