వడ్ల వ్యాపారి మరియు రైతు ఈ దేశంలో విచిత్రంగా నిజాయితీ ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయ జాలి ఎక్కువగా చూపేది పేదవాళ్లు లేదా మధ్య తరగతి వాళ్లు ఉంటారు అనేది ఒక రకంగా నానుడి కానీ అది నిజం. ఈ సంఘటన నా జీవితంలో జరిగింది దోపిడీ చేసుకునే దోపిడీ వ్యాపారస్తుల విచిత్ర ఆలోచనలు మీకు తెలియచేస్తా. గుత్తి ఒక చిన్నకారు రైతు, బుల్లిగుప్త : వడ్ల వ్యాపారి, సెటు అంటారు గుత్తి : ఆ సేటు నమస్తే బుల్లిగుప్త: ఏరా గుత్తి ఎలా ఉన్నావు గుత్తి : హా సేటు ఈ ఆ దేవుడి దయ వల్ల పంటతో వచ్చింది నాయనా ఏదో నడుస్తుంది మీలాంటి వాళ్లు మంచి చూస్తే బానే ఉంటుంది బుల్లిగుప్త : ఆ మేమేం చేస్తాం అంత దేవుడే కానీ ఏంది మొత్తం నష్టాలను ఏం చెప్తాం, గుత్తి : సేటు, మా ఊర్లో అనుకుంటున్నారు మీక చాలా నష్టాలు వచ్చినాయి అంట మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు, బుల్లిగుప్త:ఏముందిలే ఈ వ్యాపారం ఉన్న తర్వాత లాభనష్టాలు ఉంటాయి కానీ బాగా ఈసారి ఇబ్బంది పడ్డాను, గుత్తి : ఆ సేటు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈసారి సేట్ కి బాగా నష్టం వచ్చిందని మా ఊర్లో బాగా చెప్పుకున్నప్పుడు ముందే అనుకున్న నాలుగు రూపాయలు తక్కువైనా మీకే ఇద్దామని అనుకు...