T.Chiranjeevulu, IAS Ret
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో, గత నాలుగు దశాబ్దాలలో విద్యా వ్యవస్థలో విపరీతమైన ప్రైవేటీకరణ జరిగింది. ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష కోట్ల వ్యాపారం జరుగుతుంది ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయికి వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ, వాటిలో విద్యార్థుల నమోదులు క్రమంగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో, ప్రైవేట్ విద్యాసంస్థలు వేగంగా పెరిగాయి. • ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి: • 2014లో తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2023 నాటికి అవి 26000తగ్గిపోయాయి. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల లు 1231 ఉన్నాయి • గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలో సుమారు 20%-30% తగ్గుదల నమోదైంది. 2014 లొ ఇది 27లక్షలకు పడిపోయింద. • ప్రైవేట్ పాఠశాలల పెరుగుదల: • అదే కాలంలో ప్రైవేట్ పాఠశాలలు సంఖ్య 10,000 కు పెరిగాయి. • హైదరాబాద్ జిల్ల లో మొత్తం ప్రాథమిక, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదైన విద్యార్థులు 70%కి పైగా ఉన్నారు. ప్రైవేట్ రంగము లో 51.18% ఉన్నాయి.
• ఇంటర్మీడియట్ స్థాయిలో: • తెలంగాణ ఇంటర్ బోర్డు డేటా ప్రకారం, 2023లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నిష్పత్తి 23% మాత్రమే, మిగతా 77% ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారు. • కొన్ని ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు (నారాయణ, శ్రీచైతన్య) ఒక్కో విద్యార్థి నుండి రూ. 1.2 లక్షల నుంచి 2 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు.
• హయ్యర్ ఎడ్యుకేషన్ (డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్): • రాష్ట్రంలోని 146ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ఉండగా , 620కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
• మెడికల్ సీట్లలో రాష్ట్రవ్యాప్తంగా 2024 నాటికి మొత్తం 8000 MBBS సీట్లలో కేవలం 2700 సీట్లు మాత్రమే ప్రభుత్వ కళాశాలలో, మిగిలినవి ప్రైవేట్ కళాశాలలవే. • ప్రైవేట్ మెడికల్ సీట్లలో ఫీజు రూ. 25లక్షల నుంచి కోటి వరకు ఉండగా, ప్రభుత్వం ఫీజు రూ. 50,000–70,000 మధ్యే ఉంటుంది.
విశ్లేషణ: 1. ఆర్థిక భారం: ప్రైవేట్ విద్యాసంస్థల విస్తరణతో, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు విద్యను అందించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని గణాంకాల ప్రకారం, ప్రైవేట్ విద్యకు వ్యయం కుటుంబ ఆదాయంలో సగం వరకు చేరుతోంది. 2. సామాజిక అసమానత: ఈ పరిస్థితిలో సామాజికంగా అణచివేయబడిన వర్గాలు (SC, ST, BC) విద్య నుంచి మరింతగా దూరం చేస్తున్నాయి.వారు ప్రభుత్వ విద్యాపరంగా అధారపడే వర్గాలు కావడంతో, ప్రభుత్వ వ్యవస్థ దెబ్బతింటే వారు పూర్తి స్థాయిలో నష్టపోతారు. ఫీస్ రీయింబస్మెంట్ కాక చాలా మంది బిసి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు 3. ప్రభుత్వ నిర్లక్ష్యం: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, పాఠశాలలు విలీనం వంటి చర్యల , నియంత్రణ లోపం , ప్రభుత్వ ఉపాధ్యాయుల యూనియన్స్,రాజకీయాలు,కారణంగా ప్రభుత్వ రంగం విద్యలో ప్రజల నమ్మకం కోల్పోయింది. ఫలితంగా మరింతగా ప్రైవేట్ రంగం,బల పడింది . 4. నైతిక-రాజకీయ ప్రమాదం: విద్యను లాభాపేక్షతో చూడటం వల్ల అది సేవ కాక వ్యాపారంగా మారింది. ఇది విద్యను ఓ మౌలిక హక్కుగా కాక, సామర్థ్యంతో కొనుగోలు చేసే వస్తువుగా మార్చింది ఈ విధంగా విద్యా రంగంలో విపరీతమైన ప్రైవేటీకరణ వల్ల సామాజిక సమానత్వానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కొనసాగితే, అది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనాలంటే: • ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు పెంపు • టీచర్ పోస్టులు భర్తీ • పబ్లిక్ ఫండింగ్ పెంపు • ప్రైవేట్ రంగానికి సరైన నియంత్ర ఇలాంటి విధాన మార్పులు అవసరం. లేకపోతే ప్రజా విద్యా వ్యవస్థను నిలబెట్టుకోవడం అసాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషి ,నియంత్రణ తగ్గిపోవడంతో ఆ సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి .తెలంగాణ లో ఫీ నియంత్రణ దాదాపు లేదు.భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని ఫీజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తూ ఉన్నాయి ఎల్కేజీ ,యూకేజీ లో అడ్మిషన్ కొరకు కూడా కొన్ని ప్రైవేట్ పాట శాలలు 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి .ఇలాంటి దోపిడీ ఈ దేశంలో ఎక్కడా లేదు .ఇది కేవలం ఈ విద్యాసంస్థలన్నీ కూడా అగ్రకులాల చేతిలో ఉండడంతో ప్రభుత్వం చేతులుడిగి,నిర్వీర్యం అయిపోయి చూస్తూ ఉంది. ప్రజల సొమ్మును నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఐఐటి ఎంసెట్ ఇంజనీరింగ్ కోచింగ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ కోచింగ్ సంస్థలు అన్నీ కూడా ఎక్కువ మటుకు అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి. ప్రముఖ పాఠశాల/కళాశాల విద్యాసంస్థలు
1. శ్రీ చైతన్య విద్యాసంస్థలు డాక్టర్ బి.ఎస్.రావు (కమ్మ)
2. నారాయణ విద్యాసంస్థలు పున్నూరు నారాయణ (కాపు)
3. ఓక్ రిడ్జ్ విద్యాసంస్థలు- శాంతాబాను- (రెడ్డి)
4 ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్- ప్రభాకర్ రెడ్డి -రెడ్డి
5. శ్రీనిధి పబ్లిక్ స్కూల్- రెడ్డి
6. మెరీడియన్ పబ్లిక్ స్కూల్-, బీసీ
7. సిల్వర్ హోక్ స్కూల్- గోపాల కృష్ణారావు- కమ్మ
8. రాక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్- ఎం రమణ్ నాయుడు కమ్మ
9. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఫ్రాంచైసి) మల్క కొమురయ్య (మున్నూరు కాపు)
10. భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్- society
11. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ -society -ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలుగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి తర్వాత చట్టసభల్లోకి వస్తున్నారు ఉదాహరణకు చామకూర మల్లారెడ్డి ,పళ్ళ రాజేశ్వర్రెడ్డి ,బీసీ ల నుంచివచ్చిన ఏకైక వ్యక్తి మల్క కొమురయ్య గారు , అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంఎల్సీ కి పోటీ చేసారు
ప్రైవేట్ యూనివర్సిటీలు
తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల విస్తరణ – ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర?
తెలంగాణలో 2018లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం తరువాత రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల విస్తరణ వేగంగా పెరిగింది. ఈ ఏడేళ్ల కాలంలో సుమారు 12 ప్రైవేట్ యూనివర్సిటీలకు, 4 డీమ్డ్ టు బీ యూనివర్సిటీలకు 3 ఇతర రాష్ట్ర యూనివర్సిటీ లకు అనుమతులు ఇవ్వబడ్డాయి. ఈ వేగవంతమైన ప్రైవేటీకరణతోపాటు ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం ఉన్న 17 యూనివర్సిటీలను సరిపోల్చితే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను క్రమంగా బలహీనపర్చే దిశగా ఈ దోరణి సాగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? ప్రభుత్వ రంగ యూనివర్సిటీలకు మద్దతు తగ్గిస్తూ, వాటి సామర్థ్యాన్ని కుదిస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడం ద్వారా విద్యను వాణిజ్య పరం వైపు మలుస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిన ఉన్నత విద్యను, కొంతమంది ధనికులకు, కార్పొరేట్ వర్గాలకు మాత్రమే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఈ కొత్తగా ఏర్పడిన ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలను ఎవరు స్థాపిస్తున్నారు? వీటిలో దాదాపు అన్నీ ఒకే వర్గానికి – అగ్రకులాలకు చెందిన వారిచే స్థాపించబడ్డాయి. భూముల నుండి, పెట్టుబడుల వరకు, పరిపాలన పదవుల వరకూ బీసీలు లేదా ఇతర సామాజికంగా అణచివేయబడ్డ వర్గాలకు స్థానం లేదు. యూనివర్సిటీల స్థాపనలోనూ, పాలనలోనూ బీసీలకు శూన్య స్థానం ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితి విద్యారంగంలో సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉంది. ఒక్కో యూనివర్సిటీ కోట్లాది రూపాయల బడ్జెట్‌తో పనిచేస్తుంటే, వాటి పాలక మండలుల్లో బీసీ ప్రతినిధులు లేకపోవడం మన వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్న సామాజిక అసమానతలకు నిదర్శనం. ప్రభుత్వం ఈ విషయాన్ని తక్షణం పరిగణలోకి తీసుకొని
ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో సామాజిక న్యాయ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. • యూనివర్సిటీల పాలనలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయమైన ప్రతినిధిత్వం ఉండేలా నియమాలు రూపొందించాలి. • ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేసి, సామాన్య విద్యార్థుల అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలి. విద్య మనకు అమ్మకపు వస్తువు కాదు – సమాజ నిర్మాణానికి మౌలిక హక్కు.
I. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు((12)
1.అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ రెడ్డి
2. మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్ - ఉత్తర భారతం
3.వ్యాక్సన్ యూనివర్సిటీ హైదరాబాద్- ఢిల్లీ
4.మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద -రెడ్డి
5.ఎస్ ఆర్ యూనివర్సిటీ వరంగల్ -రెడ్డి
6.శ్రీనిధి యూనివర్సిటీ ఘట్కేసర్ - వెలమ
7.గురునానక్ యూనివర్సిటీ ఇబ్రహీంపట్నం . సిక్కు
8. ఎం ఎన్ ఆర్ యూనివర్సిటీ - sanga reddy- రాజు
9.నికామర్ యూనివర్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టడీస్ శామీర్పేట్
10.కావేసెంట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ
11.అమిటి యూనివర్సిటీ - చెన్నై
12. సెయింట్ మేరీ రీహాబిలేటేషన్ యూనివర్సిటీ వర్గల్ సిద్దిపేట జిల్లా
II. డీమ్డ్( Deemed ) యూనివర్సటీ - (4)
1.ఐ సి ఎఫ్ ఏ ఐ, శంకర్పల్లి ,హైదరాబాద్
2.ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గచ్చిబౌలి హైదరాబాద్
3.చైతన్య యూనివర్సిటీ -వరంగల్- రెడ్డి
4.అరోరా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ హైదరాబాద్ (వంజర) B.C
III. ఇతర రాష్ట్రాల విశ్వ విద్యాలయాలు (Other state universities)
1. బిట్స్ యూనివర్సిటీ (BITS )
2 గీతం (Gitam ) యూనివర్సిటీ కమ్మ
3. కేఎల్ యూనివర్సిటీ ( K.L. university) కమ్మ
కేవలం ఏడు సంవత్సరాల్లో ప్రైవేటు యూనివర్సిటీల సంఖ్య (19) ప్రభుత్వ యూనివర్సిటీల(17) కంటే పెరిగిపోయినాయి .ఈ ప్రైవేట్ యూనివర్సిటీల లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విడుస్తున్నారు. ఈ యూనివర్సిటీలన్నీ అగ్రకులాల చేతిలో ఉండడం వల్ల వారు ప్రభుత్వం తో ఉన్నటువంటి కనెక్షన్లతో నిబంధనలకు తూట్లు పడచి ఇస్తా రాజ్యం గా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ప్రమాణాలు పాటించడం లేదు వ్యాపార సంస్థలుగా మార్చారు.డిగ్రీలు ఇచ్చేస్తున్నారు .క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిగా గా పడిపోయింది ఈరోజు ప్రైవేట్ విద్య యూనివర్సిటీలు విద్యారంగానికి ఒక పెద్ద సవాలుగా మారాయి.ఇందులో బహుజనుల పాత్ర ఏమీ లేదు.వాటా ఏమీ లేదు. యూనివర్సిటీల ప్రొఫెసర్లు గా బీసీ ,ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి నియామకం జరిగితే ఆయా వర్గాల నుంచి గొప్ప తత్వవేత్తలు ఉన్నత విద్యావంతులు ఆవిర్భవించే అవకాశం ఉంది .గతంలో ఇలా ఎదిగారు .కానీ దురుద్దేశంతో ప్రభుత్వము యూనివర్సిటీల నిర్వీర్యం చేసి ఉద్యోగాలను నింపడం లేదు.
Comments
Post a Comment