ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్‌లో బీసీలకు చోటు ఎక్కడ?
హైదరాబాద్ — ఇది దేశంలో ఫార్మా రాజధాని, జీనోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ హబ్, APIs ఉత్పత్తుల కేంద్రంగా పేరు గాంచింది. ప్రపంచ మార్కెట్లకు మందులు సరఫరా చేసే ప్రధాన కేంద్రం. సుమారు 800 కి పైగా ఫార్మా కంపెనీలు, ఐ మార్క్ గ్రూప్ రిపోర్ట్ ప్రకారము భారతదేశ ఔషధం మార్కెట్ 61.36 బిలియన్ డాలర్స్ .ఇందులో మూడో వంతు హైదరాబాద్ అనుకుంటే సుమారు 18 లక్షల కోట్ల టర్నోవర్తో హైదరాబాద్ దేశం గర్వపడే స్థాయిలో ఐమార్క్ గ్రూప్ .ఔషధాల తయారీలో మొదటి స్థానం మరియు ఫార్ములేషన్ల తయారీ లో 3 వ స్థానం కానీ ఈ అద్భుత వృద్ధిలో బీసీలకు మాత్రం ఒరిగిందేమీ లేదు.
మేజర్ కంపెనీలపై ఓ దృష్టి:
కంపెనీ పేరు--- స్థాపకులు / యజమానులు సామాజిక వర్గం / కులం
1. డా।। రెడ్డిస్ ల్యాబ్- కల్లం సతీష్ రెడ్డి రెడ్డి
2. అరబిందో ఫార్మా - రామ ప్రసాద్ రెడ్డి, నిత్యానంద రెడ్డి రెడ్డి
3. దివిస్ ల్యాబ్- మురళి కృష్ణ చౌదరి కమ్మ
4. హెటెరో డ్రగ్స్ -- బి. పార్ధ సారథి రెడ్డి (రాజ్యసభ MP కూడా ) రెడ్డి
5. నాట్‌కో ఫార్మా -- వి.సి. నన్నపనేని కమ్మ
6. లారస్ ల్యాబ్స్ డాక్టర్ సత్యనారాయణ చవ్వా బ్రాహ్మణ/OC
7. సురక్ష ఫార్మా సోమేశ్వర మన్నేపల్లి
8. శిల్పా మెడికేర్ విష్ణుకాంత్ భర్గవ OC వర్గం
9. ఎం ఎస్ న్ ల్యాబొరేటరీస్ సుధీర్ రెడ్డి రెడ్డి
10. స్పాన్సులెస్ గుత్తికొండ వేంకట సుబ్బా రావు
హైదరాబాదు కేంద్రంగా ఉన్న ప్రముఖ బయోటెక్నాలజీ మరియు బయోఫార్మా కంపెనీలు, వాటి స్థాపకులు మరియు యజమానుల వివరాలు
హైదరాబాద్‌లో ప్రముఖ బయోటెక్ & vaccine కంపెనీలు
1. బయాలాజికల్ ఈ. లిమిటెడ్ (Biological E. Ltd)• స్థాపకులు: డాక్టర్ డి.వి.కె. రాజు
• ప్రస్తుత యాజమాన్యం: మహిమా డాట్ల --చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్/ ఎండీ
2. శాంత బయోటెక్నిక్స్
• స్థాపకులు: డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి,
• ప్రస్తుతం: ఫ్రెంచ్ ఫార్మా దిగ్గజం సనోఫీ చేత పూర్తిగా స్వాధీనం
3. భారత్ బయోటెక్ కృష్ణా ఎల్ల మరియు సుచిత్ర ఎల్ల కమ్మ కోవాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి సంస్థ
4 ఆరజెన్ లైఫ్ సైన్సెస్ (Aragen Life Sciences – మాజీ GVK Bio)
• ప్రారంభం: జీవీకే బయో (GVK )గ్రూప్ ద్వారా
• ప్రస్తుతం: మేజర్ పెట్టుబడి సంస్థ క్వాడ్రియా కాపిటల్ ( Quadria Capital )ఆధ్వర్యంలో
5 లారస్ ల్యాబ్స్ (Laurus Labs)
• స్థాపకులు & CEO: డా. సత్యనారాయణ చవ్వా (2005లో స్థాపన) బ్రాహ్మణ/OC
• గుర్తించదగినది: లారస్ బయో అనే బయోటెక్ శాఖను కూడా నడుపుతోంది
6. ఇండియన్ ఇమ్యునాలజికల్స్- మినిష్ షా
7.. సువెన్ లైఫ్ సైన్సెస్ (Suven Life Sciences)- • స్థాపకులు: వేంకటేశ్వర్లుజాస్తి
• ప్రత్యేకత: బయోఫార్మా R&D సంస్థ
8.. ఐజంట్ (Aizant) • స్థాపకులు: వర్మ రుద్రరాజు
• ప్రత్యేకత: కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థగా సేవలు
9. కోల ( KOLA) – కోల మీనాక్షి మరియు సౌజన్య గుడాటి
10 . పల్స్ పర్మాస్యూటోకల్స్ - కె వి రాంబాబు
ఇవన్నీ అగ్రవర్ణాలైన రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యంలో ఉన్నాయి. కానీ బీసీల సంస్థలు ఈ స్థాయికి చేరే పరిస్థితి లేదు. ఒక్క బీసీ కూడా ఈ 10 టాప్ కంపెనీలలో యజమాని కాదు. ఇది సహజంగా ఏదైనా అనిపించవచ్చు, కానీ ఇది కులాదిపత్య వ్యవస్థ ఫలితమే.
ఈ వ్యవస్థలో బహుజనులకేమో ఫుల్ కాలుష్యము, రోగాలు ,మందులు ,ఆస్పత్రులు .ధనవంతులు ,యజమానులకు ఏమో లాభాలు, విలాసవంతమైన జీవనం, విదేశీ యాత్రలు ఈ ఫార్మా కంపెనీలు చాలా వరకు భద్రత ప్రమాణాలు పాటించడం లేదు.
హైదరాబాదులో గతంలో ఐడిపీఎల్, ఐడిఎల్ లాంటి ప్రముఖ ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలు ఉండేవి. క్రమముగా ఆ సంస్థలు నష్టాల బాట పట్టడంతో అందులో పనిచేసిన కొందరు ప్రముఖులు బయటకు వచ్చి తమ స్వంత ఫార్మా కంపెనీలు స్థాపించి ఈరోజు ఫార్మా రంగంలో రారాజులుగా వెలుగొందుతున్నారనేది అక్షర సత్యం.అందులో పని చేసినప్పుడు అక్కడి ఫార్ములాలను తీసుకొని వచ్చి బయట తమ సొంత కంపెనీలు పెట్టారనే ప్రచారం కూడా కలదు
తెలంగాణ రాష్ట్రం రూపొందించిన MSME పాలసీలో కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు, ఇది బీసీ లపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ.
బీసీలు ఎందుకు ఎదగ లేకపోయారు?
1. చారిత్రాత్మకం గా అవకాశాల నుంచి బహిష్కరణ – బీసీలకు వ్యాపార అవకాశాలు, విద్య, పెట్టుబడులపై పట్టు లేకుండా పాలకులు అణిచేశారు.
2. ఆధిపత్య కులాల గుత్తాధిపత్యం – భూములు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ అనుమతులు అన్నీ అగ్రవర్ణాల చేతుల్లో ఉండటంతో బీసీలను బయటకు నెట్టేశారు.
3. పాలక వర్గాల పక్ష పాతం – మేధావుల, ఉద్యమ నేతల, పాలకుల నిర్లక్ష్యం వల్ల బీసీల్లో సామూహిక పారిశ్రామిక విజ్ఞానం అభివృద్ధి కాలేదు.
4. కేవలం పెద్ద వాళ్లకే భూకేటాయింపులు,సెజ్ లు – API పార్కులు, బల్క్ డ్రగ్ ప్యాకేజింగ్ సదుపాయాలు, ప్రభుత్వం మంజూరు చేసే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ పెద్ద కంపెనీలకే దక్కాయి.
5. బీసీ యువతకు అవకాశం కరువు – ఎంజీ ఫార్మసీ, బీ ఫార్మసీ చదివిన బీసీ విద్యార్థులు కేవలం ఉద్యోగస్తులుగా పరిమితమవుతున్నారు, యజమాన్య స్థాయికి చేరలేక పోతున్నారు .
ఈ అసమానతలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది
పాలకుల నోట “సామాజిక న్యాయం”, “అవకాశాల సమానత్వం” అన్న మాటలు రావడం పరిపాటే కానీ, బీసీలకు పారిశ్రామికతలో వాటా ఇవ్వడంలో ఎలాంటి కార్యాచరణ కనిపించదు. ఫార్మా రాజధానిలో బీసీలకు కేవలం ల్యాబ్ టెక్నీషియన్, వర్కర్ స్థాయిలోనే చోటుండాలి అన్నదే వ్యవస్థ భావన. ఇదే అసమానతపై ఇప్పుడు ప్రశ్నించాలి.
బీసీల ప్రగతికి చట్టబద్ధ చర్యలు అవసరం:
1. ఫార్మా రంగంలో బీసీల కోసం ప్రత్యేక పార్కులు – బీసీ ఎంట్రప్రెన్యూర్లకు ఫైనాన్స్, స్కిల్ డెవలప్మెంట్, R&D స్టార్టప్ మద్దతు కల్పించాలి.
2. బీసీ పారిశ్రామిక నిధి స్థాపన – రాష్ట్ర ప్రభుత్వం బీసీ పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీ రుణాలు, ఉపసంహరణలతో నిధిని రూపొందించాలి.
3. ఇండస్ట్రియల్ రిజర్వేషన్ పాలసీ – ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలలో బీసీలకు కనీసం 50%వాటా ఉండాలి.
4. బీసీ పారిశ్రామిక వేదికలు – టిడ్కో తరహాలో బీసీ పారిశ్రామికవేత్తల కోసం ఫోరమ్ ఏర్పాటు చేయాలి
ఆధిపత్య కులాలు ,అధికారం ఒక్కటై కాలుష్య నియమ నిబంధలను ను తుంగలో తొక్కి హైదరాబాదులో ఫార్మా రంగా విలసిల్లుతుంది అందుకు ఉదాహరణ ఈ మధ్య సుగాచి ఫార్మా కంపెనీలో పేలినటువంటి రియాక్టర్ .ఈ ప్రమాదంలో సుమారు 42 మంది మరణించారు వీరంతా కూడా బహుజనులే.వీరి ప్రాణాలకు లెక్క లేదు ఏదో కంటి తుడుపుడుపు గా కొంత నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు . కాలుష్యం బడుగు బలహీన వర్గాలకు ప్రాప్తం అయింది .లాభాలు మాత్రం అగ్రకులాల కు . వాళ్లేమో యజమానులు, బీసీ లే మో కార్మికులు. బీసీ లు,బహుజనులు వేళ్ల మీద లెక్కపెట్టే వాళ్ల కొరకు పని చేయాలి .ఇది ఈ దేశ సామాజిక నీతి
హైదరాబాద్ అభివృద్ధి మాటల్లో అందరిది; కానీ ఫలితాల్లో మాత్రం కొందరిదే. ఫార్మా రాజధానిలో బీసీలకు స్థానం ఇవ్వాలంటే — వాటా (హిస్సా), గౌరవం (ఇజ్జత్), అధికారం (హుకుమత్) అనే నినాదాలు పారిశ్రామిక రంగంలోనూ వినిపించాలి. ఇప్పుడు మౌనం వదిలి, ప్రశ్నించే సమయం వచ్చింది:
Comments
Post a Comment