రిజర్వేషన్లు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16లను ప్రాథమిక హక్కుల విభాగంలో చేర్చారు ( Part III ). ఇవి ఎవరి విచక్షణ ,దయ,
దాక్షిణ్యాల మీద ఆధారపడి లేవు . శతాబ్దాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అణచి వేత ద్వారా సృష్టించ బడిన సామాజిక, విద్యా, ఆర్థిక అసమానతలను సరిదిద్దడానికి రూపొందించిన న్యాయబద్ధమైన వ్యవస్థ. సామాజిక విప్లవం న కు నాంది పలికిన వ్యవస్థ.
ఆర్టికల్ 15 విద్యా రంగంలో సమాన అవకాశాలను కల్పించడానికి, ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రానికి / కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఇందులో 15(4), 15(5), 15(6) వంటి ఉపవిభాగాల ద్వారా విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత కల్పించబడింది. అదేవిధంగా, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను నిర్ధారించడమే కాకుండా, 16(4) ద్వారా రాష్ట్ర / కేంద్ర సేవల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాల పౌరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి/ కేంద్ర నికి అధికారం ఇవ్వబడింది. ఇది సమాన అవకాశాల సాకారానికి మరియు ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించిన ఒక సాధికార నిబంధన. ఇది ప్రభుత్వ సేవల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు , సామజిక న్యాయాన్ని కల్పించే కీలకమైన నిబంధన.
రాజ్యాంగంలో ఇక్కడ(16(4)) లో “వెనుకబడున తరగతులు “ అనే పదాన్ని వాడడం జరిగింది. అయితే ఎవరు ఈ వెనుక బడిన తరగతులు అనే అంశం పై న్యాయస్థానాలు తర్వాత కాలం లో ఎస్సీ లు. ఎస్టీలు, మరియు ఇతర వెనుకబడిన తరగతులుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆర్టికల్ 16(4 )ప్రకారం, మొదటి నుంచి అంటే1950 నుంచి ఎస్సీ, ఎస్టీ లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉద్యోగాలలో కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్స్ ల లో కూడా రిజర్వేషన్స్ 1955 లో కల్పించడం జరిగింది . అయితే బీసీలు ఎవరు అనేటువంటి అంశం నిర్ధారణ కాలేకపోవడంతో, 1993 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ లేని పరిస్థితి ఏర్పడింది
అయితే, అప్పటివరకు ప్రమోషన్స్ ల లో రిజర్వేషన్ల ను అనుభవిస్తున్నటువంటి sc/ st వర్గాలకు 1992 లో ఇందిరా సహాని కేసులో ప్రమోషన్స్ ల లో రిజర్వేష న్లు చెల్లవు అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది ,రిజర్వేషన్లు అనేటివి కేవలం మొదట అప్పాయింట్మెంట్లకే పరిమితంఅని , ప్రమోషన్లలో ఇవ్వడానికి చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించడం జరిగింది. దీనితో, బెంబేలెత్తిన కేంద్ర ప్రభుత్వం ,అప్పటి కాంగ్రెస్ ప్రధాని పివి
నరసింహారావు1995 లో 77 వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి, ఆర్టికల్ 16A ను రాజ్యాంగంలో చేర్చి, ఎస్సీ, ఎస్టీ లకు మాత్రమే ప్రమోషన్స్ ల లో రిజర్వేషన్లు కల్పించినారు. అలాగే తర్వాత కాలం లో సుప్రీమ్ కోర్ట్ క్యాచ్ అప్ రూల్ తీర్పు ను ను అధిగమించటానికి వాజపేయి ప్రభుత్వం 2001 లో 85 వ రాజ్యాంగ సవరణ చేసి పర్యవసానం సీనియారిటీ( Consequential Seniority ) ని ఆర్టికల్ 16 (4A) లో చేర్చారు కానీ, అప్పటికే ఇందిరా సహాని కేసులో ఓబిసి లకు కూడా 27% రిజర్వేషన్ అమలు పరచాలని తీర్పు ఇచ్చి ఉన్నారు. 1993 నుంచి అమలు లో ఉంది. కాబట్టి, ప్రమోషన్లలో కూడా 27% వరకు రిజర్వేషన్లు ఓబిసి లకు ఇవ్వవచ్చు . ఆ విధం గ 77 వ రాజ్యాంగ సవరణలో చేర్చి ఉన్నట్టయితే, ఓబిసి లు కూడా లబ్ది పొందే అవకాశం ఉండేది. కానీ, ఆనాటి ప్రభుత్వం ఓబిసి ల పట్ల అతి క్రూరంగా వ్యవహరించి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాకుండా ఉద్దేశ్య పూర్వకముగా అడ్డుకున్నది . ఓబీసీ ల నోట్లో మట్టి కొట్టింది
అలాగే, తర్వాతి కాలము లో 77 వ రాజ్యాంగ సవరణను చట్టం 1995 ను నాగరాజు మరియు ఇతరులు vs యూనియన్ అఫ్ ఇండియా కేసు లో సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఈ కేసు లో(2006) 16 (4A) ను సుప్రీం కోర్టు చెల్లుబాటు తనాన్ని ఒప్పుకోవడం జరిగింది . అలాగే మూడు సూత్రాలను ప్రతిపాదించింది. ఒకటి, ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేకపోయినప్పుడే ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్లు పరిగణించాలి. రెండవది, ఈ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకు చెందిన వారై ఉండాలి. మూడవది పరిపాలన సామర్థ్యాన్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు.
ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తు పెట్టు కోవాలి . ఆర్టికల్ 16(4) లో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ, ఎస్టీ, మరియు ఓబీసీ లు. మరి ఎస్సీ, ఎస్టీ లకు మాత్రమే ఇచ్చి ఓబిసీలకు ఇవ్వకపోవడం రాజ్యాంగపరమైన వివక్షత తప్ప ఇంకోటి కాదు . ఈ వివక్షత లను మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు బీసీల పట్ల చూపుతూనే ఉన్నాయి. ఆధిపత్య , అగ్ర ,పాలక వర్గాలు మొదటినుంచి ఓబీసీ రిజర్వేషన్స్ ను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు బీసీలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రమోషన్లలో సరియైనటువంటి న్యాయం జరగక నేడు దయనీయమైన స్థితిలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది
OBCలకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్ తీసుకురావాలంటే సాధారణ పాలసీ మార్పులు సరిపోవు . రాజ్యాంగ, న్యాయ, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్యలు అవసరం.
1. రాజ్యాంగ సవరణ - ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 16(4A) కేవలం SC/STలకు మాత్రమే వర్తిస్తుంది. దీనిలో OBCలను చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయా లి . పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్ ప్రవేశ పెట్టాలి. ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి . ఇది జరిగితేనే OBCలకు లీగల్ బేస్ వస్తుంది.
2. నాగ రాజు కేసు లోని సుప్రీమ్ కోర్ట్ విధించిన ట్రిపుల్ టెస్ట్ ను సంతృప్తి పరచాలి.
3. OBCలు ఇంకా వెనుకబడి ఉన్నారు . సమగ్ర కులగణన లాంటి లెక్కలు ఉపయోగ పడుతాయి
2.తగినంత ప్రాతినిధ్యం లేదనే సాధికారకమైన సమాచారం మరియు నిరూపణ. ప్రభుత్వ గణాంకాల ప్రకారం JANUARY 1 వ తేదీ 2024 నాటికి ఇప్పటికి బీసీ లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 26.31% మాత్రమే ఉన్నారు. అలాగే గ్రూప్ A ఉద్యోగాలలో 19.14%, గ్రూప్ B ఉద్యోగాలలో 21.95 % మాత్రమే ఉన్నారు. అంటే ఉన్నత ఉద్యోగాలలో నేటికీ 27% రిజర్వేషన్ స్థాయి కూడా చెర లేరు. అందుకే ప్రమోషన్స్ ల లో రిజర్వేషన్స్ అవసరం. రాహుల్ గాంధీ గారి లెక్కల ప్రకారం భారత ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. కేవలం 5% బడ్జెట్ పై నియంత్రణ కలిగి ఉన్నారు
1. పరిపాలన సామర్థ్యం దెబ్బ తిన దనే నిరూపణ జానికి ప్రమోషన్ స్థాయికి వచ్చే వరకే ఆ పోస్ట్ కు కావాల్సిన అర్హతలు, డిపాట్మెంటల్ పరీక్షలు పాస్ అవుతారు. అలాగే అతని పనితనం పై రహస్య వార్షిక నివేదిక లు ఉంటాయి.కాబట్టి సామర్థ్యము దెబ్బ తింటుందనే ప్రశ్నయే ఉత్పన్నం కాదు..
ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడానికి కావలసిన అర్హతలు, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేమిటి? పొలిటికల్ వీల్. (Political Will)- రాజకీయ శక్తి & ఒత్తిడి. ఇది అసలు కీ పాయింట్. SC/STలకు ప్రమోషన్ ల లో రిజర్వేషన్ రావడానికి కూడా రాజకీయ ఉద్యమాలే కారణం .అదే విధంగా OBCలకు కూడా బలమైన సామాజిక ఉద్యమం, ఐక్యత , రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇది పాలసీగా రావడం చాలా కష్టం
ప్రమోషన్‌లో రిజర్వేషన్ హక్కు ఎందుకు అవసరం?
బీసీల స్వాభిమానానికి, అధికారానికి ఇది కీలకం .భారతదేశంలో రిజర్వేషన్ అనే వ్యవస్థను కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే పరిమితం చేయడం ఒక పెద్ద సామాజిక అన్యాయం. బీసీలు మొదటి స్థాయి ఉద్యోగాల్లోకి ప్రవేశం పొందిన అధికార స్థాయిలకు చేరకుండా అడ్డుకట్టలు వేయుతున్నారు. ఇది యాదృచ్చికం కాదు; ఇది ఒక నిర్మాణాత్మక అసమానత. ఉద్యోగం ఇచ్చి, ప్రమోషన్లు ఎందుకు ఇవ్వరు? ఎంట్రీ ఇస్తారు కానీ ఎదుగనివ్వరు. నేటికి నిర్ణయాలు తీసుకునే స్థానాలు ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉన్నాయి.
ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది: ఉద్యోగం ఒకటే సరిపోతుందా, అధికారంలో భాగస్వామ్యం వద్దా అని? ప్రమోషన్ లేకుండా రిజర్వేషన్ అర్థం లేనిది. ఒక ఉద్యోగ జీవితంలో అసలు ప్రగతి, ప్రమోషన్ ద్వారానే జరుగుతుంది. ప్రమోషన్ ద్వారా జీతం పెరుగుతుంది, నిర్ణయాధికారం వస్తుంది, విధానాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతాడు హోదా పెరుగుతుంది. కానీ బీసీలు ఈ మెట్టుకు వెళ్లకుండా అడ్డుకుంటే, రిజర్వేషన్ కేవలం “ప్రవేశ పాస్‌గానే “ మిగిలిపోతుంది. మరి బీసీల ఓట్లు మాత్రం రాజకీయ పార్టీలకు కావాలి. అడగకుండానే EWS రిజర్వేషన్లు వారం రోజుల్లో ఈ దేశంలో అమలు చేస్తారు. అదే విధంగా, మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఆగ మేఘాల మీద ప్రవేశపెడతారు. కానీ బీసీల హక్కుల కొరకు వచ్చినప్పుడు, దాన్ని రాకుండా ఎలా అడ్డుకోవాలనే దానిపైన అన్ని రాజకీయ పార్టీలు ఒకటై ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి ఇలా జరిగినప్పుడు బీసీలకు సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుంది?
రాజ్యాంగం ప్రవచించిన సమానత్వం సాధ్యం కావాలంటే బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు తప్పనిసరి. సమానత్వం అంటే కేవలం ఒక తలుపు తెరవడం కాదు, అందరూ ఒకే మెట్టుపై నిలబడేలాగా చేయడం. బీసీలను ఎంట్రీ దగ్గరే నిలిపి పై స్థాయిలోకి వెళ్ళనివ్వకపోతే అది అసమానత్వాన్ని కొనసాగించే విధానం. అయితే బీసీ సంఘాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి: ప్రభుత్వాలు అడగందే ఏప్పటికీ ఇవ్వవు. బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అలాగే ఇప్పుడున్నటువంటి సమాచారం ఆధారంగా న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేయాలి. అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రాజ్యాంగ సవరణకు పూనుకుంటాయి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి.ఈ ధర్మ,న్యాయబద్ధమైన పోరాటములో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ మీకు ఎప్పడు అండగా ఉంటుంది.
టి . చిరంజీవులు . విశ్రాంత ఐఏఎస్ మరియు
చైర్మన్ బీసీ ఇంటెలెక్టుల్స్
Comments
Post a Comment