రాచరిక వ్యవస్థ లో మహారాజులు/రాణులు బయటకు వెళ్లినప్పుడు వారిని మోయడానికి బోయిలు ఉండేవారు. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ లొ కూడా ఆధిపత్య కుల కులాల వారు పదవులు అధిష్టించడానికి ఓటర్లనే బహుజన వర్గాల వారు మోస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు. విచిత్రమేమిటంటె ఏమిటంటే, ఇక్కడ ఆధిపత్య కుల మహిళలు తల్లిదండ్రులను, అన్నా తమ్ముళ్ళను కూడా లెక్క చేయకుండా పార్టీ లు స్ధాపించిఅధికారం కోసం తమ వారితోటే పోటీ పడుతున్నారు. బహుశా దేశంలో ఎక్కడా ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదేమో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక కొత్త తరహా రాజకీయ దృశ్యం రూపుదిద్దుకుంటోంది. ఒకే కుటుంబంలోనే రెండు రాజకీయ ధృవాలు ఏర్పడి, అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఒకరి పై ఇంకొకరు కత్తులు దూసుకుంటున్నారు ,బహుజనులను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు .వాళ్ళ అవినీతి చిట్టాలను బయటపెట్టుకొంటున్నారు .ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబంలో అన్న–చెల్లెల్ల మధ్య అధికారం కోసం పోటీ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో తండ్రి–కూతుళ్ల మధ్య రాజకీయ పోటీ. బయటకు ఇది భిన్న పార్టీల మధ్య పోటీలా కనిపించినా, లోపలికి చూస్తే ఇది ఒకే కుటుంబం లోపల అధికారం పంచుకునే ఓ రాజకీయ కు తంత్రం ...