ప్రెస్ నోట్
బీసీల కోసం ఏప్రిల్ 11న విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, జేఏసీలు, కుల సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలి – ఓరుగంటి వెంకటేశ్వర్లు
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీన విజయవాడలో నిర్వహించిన బీసీ సింహగర్జన మహాసభలో ప్రకటించిన ఐదు కీలక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బీసీల జీవితాలను మార్చగల ఈ డిమాండ్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ సభ్యులకు, ప్రతి జిల్లా కలెక్టర్లకు వినమ్రంగా సమర్పించాం. సభ జరిగి 40 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరం అని బీసీవై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
బీసీవై ప్రభుత్వం ముందుంచిన 5 ప్రధాన డిమాండ్లు
1️⃣ బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
2️⃣ అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి
3️⃣ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి
4️⃣ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి
5️⃣ బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి
శ్రీ రామచంద్ర యాదవ్ గారి పోరాటానికి ప్రజల నుంచి రోజురోజుకు విశేష స్పందన, ఆదరణ లభిస్తోందని, రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ బహుజనులను ఐక్యం చేస్తామని ఓరుగంటి వెంకటేశ్వర్లు తెలియజేశారు.
ముందుగా ప్రకటించిన విధంగా శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నారు.
భారతదేశ చరిత్రలో బీసీల కోసం ఇంతవరకు ఎవరూ చేయని సాహసోపేతమైన నిర్ణయంగా దీన్ని బీసీవై భావిస్తోంది. “ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు సాధ్యం కాదు” అన్న సంకల్పంతో, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బీసీల భవిష్యత్తు, బీసీ బిడ్డల రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఓరుగంటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ – రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, పౌర సమాజం, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీ రామచంద్ర యాదవ్ గారి దీక్షకు తమ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.
Comments
Post a Comment