T. Chiranjeevulu, IAS Ret
తెలంగాణలో బీసీలు జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలోనూ, ప్రభుత్వ నిర్ణయాలలోనూ వారి ప్రాతినిధ్యం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు సామాజిక న్యాయం అనే మౌలిక సూత్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఒక ప్రాథమిక ప్రశ్నను ముందుకు తెస్తోంది — నామినేటెడ్ పోస్టులకు బీసీలు అర్హులు కారా ?
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ముందు
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి
డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు
కల్పిస్తామని, విద్య, ఉద్యోగాలు, స్థానిక
సంస్థల్లో సామాజిక న్యాయం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలు బీసీ సమాజంలో
కొత్త ఆశలు రేకెత్తించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు
కనిపించకపోవడం బీసీ సమాజంలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం
సుమారు 70కి పైగా
కార్పొరేషన్లు, బోర్డులకు
చైర్మన్లను నియమించింది. అయితే ఆ
నియామకాలలో సామాజిక సమతుల్యత కనిపించడం లేదు. అందులో సుమారు 31 కార్పొరేషన్లు
ఒకే ఆధిపత్య కులానికి చెందిన రెడ్డి వర్గానికి కేటాయించబడినట్టు
కనిపిస్తోంది. కమ్మలకు 4, బ్రాహ్మణులకు 3, వెలుమలకు 2, ముస్లింలకు 7, ఎస్సీలకు 7, ఎస్సీలకు 4, బీసీలకు 12 , కులం తెలియని
వారు 3 మొత్తం 73ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు; సామాజిక
న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే అంశం.( కార్పొరేషన్ ల వారీగా చైర్మన్ లు పట్టిక 1లో చూడ గలరు)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు
ఆశించినది సామాజిక న్యాయం, సమాన
అవకాశాలు, బహుజన
ప్రాతినిధ్యం. కానీ
ప్రస్తుత పరిస్థితి చూస్తే కొన్ని ఆధిపత్య వర్గాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత
లభిస్తోందనే భావన బలపడుతోంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా ఇంత స్పష్టమైన కుల
ప్రాధాన్యత కనిపించలేదనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో వినిపిస్తోంది.
నామినేటెడ్ పోస్టులు కేవలం పదవులు మాత్రమే
కావు. అవి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే కీలక స్థానాలు. ఈ స్థానాల్లో ఎవరు
ఉంటారో, వారు సమాజంలోని వర్గాల సమస్యలను ఎలా
ప్రతిబింబిస్తారో కూడా నిర్ణయిస్తాయి. అందుకే ఈ పోస్టుల్లో సామాజిక
సమతుల్యత ఉండటం అత్యంత అవసరం.
తెలంగాణలో బీసీలు కేవలం ఓటర్లుగా మాత్రమే
కాకుండా, రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన
వర్గం. వ్యవసాయం నుంచి వృత్తులు, చిన్నతరహా
వ్యాపారాలు నుంచి సేవారంగాల వరకు — ప్రతి రంగంలో బీసీలు ఈ సమాజానికి ఆర్థిక బలం.
అలాంటి వర్గాలకు రాజకీయంగా, పరిపాలనా
పరంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య ధర్మం.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అసమానతను
సరిదిద్దాలి. ఇప్పటికే ఖాళీగా ఉన్న సివిల్
సప్లైస్ కార్పొరేషన్, ఆర్టీసీ
కార్పొరేషన్, హౌసింగ్
కార్పొరేషన్, పొల్యూషన్
కంట్రోల్ బోర్డు, మహిళా కమిషన్ వంటి కీలక
సంస్థల చైర్మన్ పదవులకు బీసీలు మరియు ఇతర బహుజన వర్గాలకు ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వర్గాలు “రెడ్డి వర్గం
మద్దతుతోనే మేము అధికారంలోకి వచ్చాము కాబట్టి వారికి ప్రాధాన్యత ఇవ్వడం సహజం” అనే వాదన
వినిపిస్తున్నాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం వారు గుర్తుంచుకోవాలి — తెలంగాణలో
ఒక్క కులం ఓటుతోనే ఏ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర బహుజన
వర్గాల మద్దతు లేకుండా ఏ రాజకీయ శక్తి కూడా అధికారంలో నిలవలేదు.
ఈ నేపథ్యంలో మరో ప్రశ్న కూడా సహజంగానే
ఉత్పన్నమవుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక
న్యాయం, కులగణన, సమాన
అవకాశాలు గురించి బలంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు
రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో జరుగుతున్న ఈ పరిపాలన గురించి సమాచారం లేదా? లేక ఈ
పరిస్థితిని గమనించే తీరిక లేదా? లేక చూసీ
చూడనట్టు వదిలేస్తున్నారా? అనే సందేహాలు
కూడా బహుజన వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
తాము సామాజిక
న్యాయం కోసం పోరాడే పార్టీ అని
చెప్పుకునే వారికి ఇలాంటి అసమానతలు ఎలా సమర్థనీయంగా కనిపిస్తాయో అర్థం కాని అంశంగా
మారుతోంది.
సామాజిక న్యాయం కేవలం ఒక రాజకీయ నినాదం కాదు; అది ప్రభుత్వ
విధానాల్లో ప్రతిబింబించాల్సిన విలువ. బీసీలకు న్యాయం చేయకుండా, వారి
ప్రాతినిధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ కొనసాగితే, అది
రాజకీయంగా కూడా ప్రభావం చూపడం ఖాయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజల తీర్పే
తుది తీర్పు.
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం అమలు
కావాలంటే, బీసీలు మరియు ఇతర బహుజన వర్గాలకు రాజకీయంగా, పరిపాలనా
పరంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడం తప్పనిసరి. లేకపోతే పెరుగుతున్న అసంతృప్తి
భవిష్యత్తులో పెద్ద రాజకీయ చర్చకు దారితీయడం అనివార్యం. త్వరలో
సుమారు 40 నామినేటెడ్ పోస్ట్స్ నింప బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ పోస్ట్స్
బహుజనుల కిచ్చి కాంగ్రెస్ పార్టీ తమ చిత్త
సుద్ధి నిరూపించుకోవాలని బహుజనులు కోరుతున్నారు.
|
పట్టిక నెం I కార్పొరేషన్
వారీగా సామాజిక వర్గం ప్రాతినిధ్యం |
|||
|
క్ర.సం |
కార్పొరేషన్/అధికారం |
చైర్మన్ |
కులం |
|
1 |
స్పోర్ట్స్ అథారిటీ |
శివ సేన రెడ్డి |
రెడ్డి |
|
2 |
రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ |
రామ్ రెడ్డి మల్ రెడ్డి |
రెడ్డి |
|
3 |
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కార్ప్ లిమిటెడ్. |
నిర్మలా జగ్గ రెడ్డి (గౌడ్) |
రెడ్డి |
|
4 |
స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. |
ఎ. ప్రకాష్ రెడ్డి |
రెడ్డి |
|
5 |
అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ లిమిటెడ్. |
చల్లా నరసింహ రెడ్డి |
రెడ్డి |
|
6 |
లోకాయుక్త |
రాజ శేఖర్ రెడ్డి |
రెడ్డి |
|
7 |
రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, చైర్మన్లు |
జస్టిస్ సంతోష్ రెడ్డి |
రెడ్డి |
|
8 |
న్యాయ సభ్యుడు |
పల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి |
రెడ్డి |
|
9 |
జ్యుడీషియల్ రిజిస్ట్రార్ |
గోవింద్ రెడ్డి |
రెడ్డి |
|
10 |
తెలంగాణ మీడియా అకాడమీ |
కె. శ్రీనివాస్ రెడ్డి |
రెడ్డి |
|
11 |
సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ |
అన్వేష్ రెడ్డి |
రెడ్డి |
|
12 |
ఆయిల్ ఫెడ్ |
జంగా రవీందర్ రెడ్డి |
రెడ్డి |
|
13 |
డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆప్ ఫెడ్. |
గుత్తా అనిల్ కుమార్ రెడ్డి |
రెడ్డి |
|
14 |
టి.ఎస్. ఫుడ్ కమిషన్ |
గోలి శ్రీనివాస్ రెడ్డి |
రెడ్డి |
|
15 |
తెలంగాణ ఉన్నత విద్య కమిషన్. |
ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి |
రెడ్డి |
|
16 |
తెలంగాణ అడ్మిషన్ మరియు ఫీజు నియంత్రణ అథారిటీ |
ఎ. గోపాల్ రెడ్డి |
రెడ్డి |
|
17 |
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు |
జి. చిన్నా రెడ్డి |
రెడ్డి |
|
18 |
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ |
పటేల్ రమేష్ రెడ్డి |
రెడ్డి |
|
19 |
డైరెక్టర్ ప్రాసిక్యూషన్ |
ఎస్. సాంబ శివ రెడ్డి |
రెడ్డి |
|
20 |
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ |
ఆర్. గురునాథ్ రెడ్డి |
రెడ్డి |
|
21 |
టి.జి. కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్. |
మానాల మోహన్ రెడ్డి |
రెడ్డి |
|
22 |
టి.జి. వ్యవసాయం మరియు ఫ్రెమర్స్ సంక్షేమ కమిషన్ |
కోదండ రామ్ రెడ్డి |
రెడ్డి |
|
23 |
ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ |
దిల్రాజు రెడ్డి |
రెడ్డి |
|
24 |
బాలల హక్కుల పరిరక్షణ కమిటీ |
సీతా దయాకర్ రెడ్డి |
రెడ్డి |
|
25 |
సెట్విన్ చైమైన్ |
ఎన్ గిరిధోర్ రెడ్డి |
రెడ్డి |
|
26 |
టి.జి. అగ్రికల్చర్ కో-ఆప్ అసోసియేషన్ (HACA) |
కె చంద్ర శేఖర్ |
రెడ్డి |
|
27 |
హైదరాబాద్ గ్రంధాలయ సంష్ట అధ్యక్షురాలు |
కె ఉపేందర్ రెడ్డి |
రెడ్డి |
|
28 |
హై పవర్ కమిటీ (ఎం అండ్ హెచ్) |
జస్టిస్ ఎ గోపాల్ రెడ్డి |
రెడ్డి |
|
29 |
బుద్ధవనం, నాగార్జున సాగర్ |
ఆంజనేయ రెడ్డి I.P.S. రిటైర్డ్ ఆంధ్ర క్యాడర్ |
రెడ్డి |
|
30 |
సెట్విన్ చైమైన్ |
ఎన్ గిరిధోర్ రెడ్డి |
రెడ్డి |
|
31 |
హై పవర్ కమిటీ (ఎం అండ్ హెచ్) |
జస్టిస్ ఎ గోపాల్ రెడ్డి |
రెడ్డి |
|
32 |
రియల్ ఈస్టేట్ రెగ్యులరరీ అథారిటీ |
ఎన్ సత్యనారాయణ |
కమ్మ |
|
33 |
T.G PCB అప్పీలేట్ అథారిటీ |
జస్టిస్ సాంబశివరావు |
కమ్మ |
|
34 |
టి.జి. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ |
ఎం. విజయ్ బాబు |
కమ్మ |
|
35 |
విజిలెన్స్ కమిషనర్ |
ఎం.జి. గోపాల్ ఐఏఎస్ (రిటైర్డ్) |
బ్రాహ్మణుడు |
|
36 |
టి.జి. విద్యుత్ నియంత్రణ సంస్థ |
జస్టిస్ డి. నాగార్జున |
బ్రాహ్మణుడు |
|
37 |
H.R.C. (న్యాయేతర) |
డాక్టర్ బి. కిషోర్ ఐ.ఎ.ఎస్. రిటైర్డ్ ఆంధ్ర కేడర్ |
బ్రాహ్మణుడు |
|
38 |
టి.జి. అపెక్స్ కో-ఆప్ చైర్‌మెయిన్ |
ఎం రవీందర్ రావు |
వెలమ |
|
39 |
టి.జి. మైనారిటీ కమిషన్ |
అహ్మద్ మొయినుద్దిన్ అన్సారీ |
ముస్లిం |
|
40 |
టెండర్ కమిటీ చియర్మెన్ |
ఎండీ అబిద్ హుస్సేన్ |
ముస్లిం |
|
41 |
టి.జి. గ్రంథాలయ పరిషత్ |
రియాద్ |
ముస్లిం |
|
42 |
టి.జి. ఫుడ్ |
ఎం.ఎ. ఫహీం |
ముస్లిం |
|
43 |
టి.జి. మైనారిటీస్ ఫిన్ కార్ప్. |
ఎండీ ఒబేదుల్లా కొత్వాల్ |
ముస్లిం |
|
44 |
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ |
డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ |
ముస్లిం |
|
45 |
టి.జి. వక్ఫ్ బోర్డు |
సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని |
ముస్లిం |
|
46 |
టి.జి. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ |
పోడెం వీరయ్య |
ఎస్.టి. |
|
47 |
ట్రైకార్ |
డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజరత్ |
ఎస్.టి. |
|
48 |
టి.జి. జిసిసి |
కె. తిరుపతి |
ఎస్.టి. |
|
49 |
టి.జి. పునరుత్పాదక శక్తి (చైర్‌మెయిన్) |
డాక్టర్ ఎ శరత్ |
ఎస్టీ |
|
50 |
టి.జి. రాష్ట్ర ఎన్నికల సంఘం |
రాణి కుముదిని |
ఎస్.సి. |
|
51 |
తెలంగాణ విద్యా కమిషన్ |
శ్రీ మురళి IAS (రిటైర్డ్) |
ఎస్.సి. |
|
52 |
టి.జి. ఫైనాన్స్ కమిషన్ |
శ్రీ రాజ్‌నాథ్ మాజీ ఎంపీ |
ఎస్.సి. |
|
53 |
టి.జి. ఎస్.సి. కో-ఆప్ డెవ్ కార్ప్. |
నాగరాజు ప్రీతం |
ఎస్.సి. |
|
54 |
టి.జి. ఎస్సీ & ఎస్టీ కమిషన్ |
బక్కి వెంకటయ్య |
ఎస్.సి. |
|
55 |
ఉపలోకాయుక్త |
బి.ఎస్. జగ్జీవన్ కుమార్ |
ఎస్సీ |
|
56 |
సంస్కృతక సారధి |
డాక్టర్ జి.వి. వెన్నెల |
ఎస్.సి. |
|
57 |
టి.జి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
బి. వెంకటేశం ఐఏఎస్ (రిటైర్డ్) |
బి.సి. |
|
58 |
టి.జి. హస్తకళల అభివృద్ధి సంస్థ. |
నాడు సత్యనారాయణ |
బి.సి. |
|
59 |
టి.జి. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. |
ఎరావత్ అనిల్ కుమార్ |
బి.సి. |
|
60 |
టి.జి. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్. |
కాసుల బాల రాజు |
బి.సి. |
|
61 |
టి.జి. ఉమెన్ డెవ్ ఫిన్ కార్ప్. |
బందరు శోభా రాణి |
బి.సి. |
|
62 |
టి.జి. వికలాంగుల కార్పొరేషన్. |
వీరయ్య |
బి.సి. |
|
63 |
టి.జి. సంగీత నాటక అకాడమీ |
ప్రొఫెసర్ అలేఖ్య పి. (బ్రాహ్మణ) |
బి.సి. |
|
64 |
టి.జి. బి.సి. కమిషన్ |
నిరంజన్ రావు |
బి.సి. |
|
65 |
టి.జి. బి.సి. ఫైనాన్స్ కార్పొరేషన్ |
నూతి శ్రీకాంత్ గౌడ్ |
బి.సి.. |
|
66 |
టి.జి. ఎం.బి.సి. కార్పొరేషన్ |
జెరిపేటి జైపాల్ |
బి.సి. |
|
67 |
బిసి డాడికేటెడ్ కమిషన్ చైర్‌పర్సన్ |
బుసాని వెంకటేశ్వరావ్ |
బి.సి. |
|
68 |
టి.జి. ఫిష్‌వర్మన్ కో-ఆప్ సొసైటీ |
మెట్టు సాయి కుమార్ |
బి.సి. |
|
69 |
టి.జి. రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీ |
బి శివ శంకర్ రావు |
కులం తెలియదు |
|
70 |
టీ.జి. టెక్నాలజీ సర్వీసెస్ |
మార్నే సతీష్ కుమార్ |
కమ్మ |
|
71 |
యాదగిరి దేవస్థానం డెవలప్‌మెంట్ అథారిటీ |
కిషన్ రావు |
వెలమ |
|
72 |
టి.జి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ (జ్యుడీషియల్) |
డి వి నాగేశ్వర్ రావు |
కులం తెలియదు |
|
73 |
టి.జి. కో-ఆప్ హౌసింగ్ ఫెడ్ లిమిటెడ్. |
కె. నవనీత్ రావు |
కులం తెలియదు |
Comments
Post a Comment