బహుజన జాగృతి:- ఛత్రపతి శివాజీ నుండి మహాత్మ ఫూలే వరకు, అంబేద్కర్ గారి నుండి మన వరకు...కొన్ని నిజాలు💥💥💥
☝️ప్రియమైన మిత్రులారా....
⚡ఛత్రపతి శివాజీ (1600)కాలంలో ఇప్పుడు పిలుచుకునే Sc, Bc Oc లు లేరు, అప్పుడు ఉన్నది వర్ణ వ్యవస్థ అంటే అగ్ర వర్ణాలు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య), శూద్రులు (ఇప్పటి BC, రెడ్డి, కమ్మ, కాపు, వెలమలు etc), అంటరానివారు (మహర్, మాల, మాదిగ etc) మాత్రమే ఉన్నారు....
💥ఆ కాలంలో దేశం ఒక్కటిగా లేదు బ్రిటిష్ వారి ఆదీనంలో ఉన్న ప్రాంతం కాకుండా సుమారు 600 పై చిలుకు రాజ్యాలుగా ఉండేవి. ఎవరి రాజ్యం వారిదే ...ఆ కాలంలో యుద్ధాలు మత ప్రాతిపదికన జరగలేదు ప్రాంతం మీద పట్టు, రాజ్యాధికారం కోసం మాత్రమే యుద్ధాలు జరిగేవి, శివాజీ ప్రధానంగా పోరాడింది బీజాపూర్ సుల్తానేట్, మొఘల్ సామ్రాజ్యం, కుతుబ్ షాహీ, పోర్చుగీస్ ఇండియా తో. ....
శివాజీకి వ్యతిరేకంగా పోరాడిన వారిలో హిందూ రాజులు (జై సింగ్, జస్వంత్ సింగ్, బాజీ ఘోర్పడే, చంద్రరావు మోరే) చాలా మంది ఉన్నారు , అలాగే శివాజీ తరపున పోరాడిన ముస్లిం నాయకులు శివాజీ సైనికాధికారిగా, అంగ రక్షకుడిగా సిద్ధి ఇబ్రహీం, శివాజీ నౌక దళపతి దౌలత్ ఖాన్ ఇలా సైన్యంలో ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు అంటే ఇక్కడ జరిగిన యుద్ధాలు మతం కోసం కాదు వారి ప్రాంత అస్థిత్వం మరియు ఆ ప్రాంతం మీద రాజ్యాధికారం కోసం జరిగాయి.
ఛత్రపతి శివాజీ స్థాపించింది హిందూ సామ్రాజ్యం కాదు ఆది అసలైన "మరాఠా సామ్రాజ్యం" మాత్రమే.....అనుమానం ఉన్నవారు చరిత్ర క్షుణ్ణంగా చదివి రెండు వైపులా ఆలోచించాలి ....
💥చాలా మందికి ఇప్పటికీ తెలియని విషయం మరియు తెలిసినా నటిస్తూ కాలం వెళ్ళ దీసుకునే విషయం
పట్టాభిషేక సమయంలో అతని వంశాన్ని ప్రశ్నిస్తూ అక్కడి ఏ ఒక్క బ్రాహ్మణుడు పట్టాభిషేం చెయ్యలేదు ఇది శివాజీ కి జరిగిన హేయమైన అవమానం. చివరికి వారణాసి నుండి గంగాభట్టు అనే బ్రాహ్మణునికి విపరీత కానుకలు సమర్పించి పట్టాభిషేకం చేయించుకున్న సందర్భం అది .....ఒక శూద్ర వీరుడు రాజుగా, చక్రవర్తిగా ఎదిగినా కూడా ఎందుకు అంగీకరించలేదో నేను వివరణ ఇవ్వను.....మీకు మీరే తెలుసుకుంటే మంచిది..శూద్ర, అంటారని ప్రజల ఎదుగుదలను, వీరత్వాన్ని వెక్కిరించడం ఇప్పటిది కాదు తరాల కాలం వెనక్కి వెళ్లి తొంగి చూడాల్సిందే..అవే అసలైన దీన గాథలు..!
💥ఇక చత్రపతి శివాజీ అంశం పక్కన పెడితే ....
💥 చత్రపతిశివాజీ పాలించిన అదే మరాఠా సామ్రాజ్యంలో, శివాజీ తదనంతరం వారి వారసుల కాలంలో అధికారాన్ని ఆస్తగతం చేసుకున్న పీష్వాలు సాగించిన వికృత చేష్టలకు, వివక్షకు మహర్ ప్రజలు 1818 జనవరి 1 భీమా కోరేగావ్ యుద్ధంతో సమాధానం చెప్పారు. ఈ యుద్ధంలో మహర్ సైనికులు (అంటరాని వారు) ఆంగ్లేయుల వైపు నిలబడి పోరాటం చెయ్యడానికి కారణం, పీష్వాలు సాగించిన వికృత చేష్టలకు, వివక్షకు వారి బతుకులు మారతాయని ఆశతో కేవలం 500 మంది మహర్ లు💥 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఎలా ఓడించిందో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడింది... బహుజన దృక్కోణంలో ఇది "చరిత్ర పుటల్లో జరిగిన ఒక అత్యంత కీలక మలుపు".
⚡ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో ఆ ప్రాంతంలో బడులు స్థాపించబడ్డాయి. అదే ప్రాంతంలో 1827 లో పుట్టిన ఫూలే ఆ ఆంగ్లేయులు స్థాపించిన బడులలో చదుకోవడం. ఆ చదువు వల్ల పొందిన విజ్ఞానంతో నిజ నిర్ధారణ తో మూడ నమ్మకాలను, వివక్షతను, సామాజిక మూస కట్టుబాట్లను ఎదురించి అందరికీ విద్యను చేరవేయడం కోసం మను సమాజంతో నిరంతరంగా సాగించిన వివేకమైన పోరాటం ఈ రోజుకీ కోట్ల మందికి స్ఫూర్తిని రగిలిస్తుంది....
☝️ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీమా కోరేగాం యుద్ధానికి మహాత్మా పూలేకు పరోక్ష సంబంధం ఉంది అనీ....ఎలా అంటే ఒకవేళ యుద్ధం జరగకపోయి ఉంటే పూలే చదువుకునే వాడే కాదు ...ఆ మను సమాజంలో అస్సలు ఆ అవకాశమే ఉండేది కాదు...
💥ఆ తర్వాత కాలంలో వచ్చిన అంబేద్కర్ గారు పూలే గారు తన సైద్ధాంతిక గురువుగా ప్రకటించుకొని, సమసమాజం కోసం, మహిళ సాధికారత కోసం, లేబర్ హక్కుల కోసం, ఆడవారి హక్కుల కోసం, రాజకీయ ఆర్థిక లక్ష్యాల కోసం నిరంతరం మనువాదులతో వివేకంగా పోరాడి వాటిని సాధించి మనలాంటి కోట్ల మందికి వీరు ఒక టార్చ్ బేరర్ లా నిలవడం.....⚡Evrey thing is interlinked......⚡
💥ఇక్కడ వారి ప్రశ్నించే తత్వం, విజ్ఞత, త్యాగం, చదువే ఈ రోజు మన ప్రజా స్వామ్యానికి, ఈ పాటి సామాజిక పురోగతికి ప్రధాన కారణం మిత్రులారా...
ఆ మహానుభావులు కూడా ఇప్పుడున్న బహుజన ఉద్యోగుల వలె స్వార్థంగా ఉండి ఉంటే మన బతుకులు ఎక్కడివి మిత్రులారా......ఛత్రపతి, పూలే, పెరియార్, అంబేద్కర్🙏, కాన్సీరామ్🙏 బాటలోనే మనమంతా సాగాలి ...... ఆలోచించండి....నిజం వైపు నిలబడదాం....మీరు మారండి, స్వార్థం వీడండి....మీ వంతుగా మన సమూహాలను ఏదో ఒక రూపంలో జాగృతం చెయ్యండి.
Comments
Post a Comment