జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు - తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మలుపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం అనేది కేవలం ఒక అభ్యర్థి గెలుపు కాదు, ఇది బీసీల రాజకీయ స్వాభిమానానికి, ఆత్మగౌరవము,సమైక్యతకు, సామాజిక న్యాయ పోరాటానికి నిలిచిన ఒక చారిత్రక విజయ గర్జన.
ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు బీసీలే అయినప్పటికీ, ఇన్నాళ్లుగా అధిపత్య కుల పార్టీలు ఈ వాస్తవాన్ని లెక్క చేయకుండా, సంప్రదాయికంగా తమవారికే టికెట్లు ఇచ్చాయి. ఈసారి కూడా అదే జరిగింది.బీజేపీ, బీఆర్ఎస్ రెండూ రెడ్డి–కమ్మ వర్గాలకు టికెట్లు ఇచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రంగం లోకి దించింది.
అగ్ర వర్ణాలకు టికెట్ నిర్ణయం బీసీ ఓటర్లలో సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తిని ఓటు పెట్టెల్లోకి ఉప్పెనలా నెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతున్న బీసీ ఉద్యమం, స్థానికంగా ఉన్న బీసీల మెజారిటీ, అలాగే ప్రాతినిధ్యం కోసం పెరిగిన ఆశలు—ఈ మూడు కలిసి బీసీ ఓటు పోలరైజేషన్‌ను తీసుకొచ్చాయి.
బీసీలకు సీటు ఇవ్వలేదనే అసహనం ఓటు రూపంలో పేలింది.
అది కేవలం ఓటు కాదు… ఒక ఆత్మగౌరవ తీర్పు.
దీని ఫలితంగా నవీన్ యాదవ్‌కు దాదాపు 25 వేల మెజారిటీ లభించింది.
ఈ ఫలితం తెలంగాణ రాజకీయాలకు ఐదు స్పష్టమైన సందేశాలను ఇచ్చింది:
1️⃣ “బీసీల ఓట్లు – బీసీలకే” అనే నూతన రాజకీయ సూత్రం
టికెట్స్ ఇచ్చిన పార్టీకే బీసీ ఓటు కట్టుబడి పోతుందని ఈ ఫలితం తేల్చిచెప్పింది.
2️⃣ బీసీ ఐక్యత ఇక అప్రతిహత శక్తి
ప్రతి నియోజకవర్గంలో బీసీల ఐక్యత వేగంగా పెరుగుతోంది.
ఇది భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చగల శక్తిగా మారుతోంది.
3️⃣ “గెలిచే గుర్రం” అన్న అగ్రవర్ణ మనోభావానికి ముగింపు
అధిపత్య కులాలకే టికెట్లు ఇస్తే గెలుస్తారని భావించే యుగం ముగిసింది.
“బీసీలకు టికెట్ ఇవ్వకపోతే… మీ ‘గెలిచే గుర్రం’ కూడా పడిపోతాడు” అని ఈ ఫలితం స్పష్టంగా హెచ్చరించింది.
4️⃣ సానుభూతి రాజకీయాలకు వీడ్కోలు. భర్త చనిపోతే భార్యకు లేదా కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే సంస్కృతికి చెల్లు బాటు చెప్పింది
సానుభూతి నాటకాన్ని బీసీలు తిరస్కరించారు.
బీసీలు ఇప్పుడు హక్కులు మాత్రమే అడుగుతున్నారు.
5️⃣ అధిపత్య కులాల కోటలు బద్దలైన రోజు
ఈ ఉపఎన్నికలో అధిపత్య కులాల ఆధిపత్య రాజకీయం అంతము అయ్యింది
ఇకపై అగ్ర కుల ఆధారిత మేనేజ్‌మెంట్ రాజకీయాలు సులభం కాదని ఈ ఫలితం స్పష్టం చేసింది. బీసీ లకు సీట్లు ఇవ్వకపోతే తమకు అధోగతి తప్పదని హెచ్చరించింది.
“నవీన్ యాదవ్ గెలుపు” అంటే “బీసీ సమాజం గెలుపు”
ఈ విజయం ఒక రాజకీయ మార్పుకు ఒక మలుపు .
“మా సంఖ్యను గౌరవించండి, మా హక్కులను గుర్తించండి, మా సీటును మాకు ఇవ్వండి.”
ఇది బీసీలు సాగిస్తున్న హిస్సా – ఇజ్జత్ – హుకుమత్ పోరాటానికి విజయసంకేతం.
“మేం ఎంతో మాకంత ” అన్న భావనకు వచ్చిన గొప్ప బలం.
నవీన్ యాదవ్ గెలుపు ఒక వ్యక్తి విజయం కాదు,
ఇది బీసీ సమాజ రాజకీయ మెల్కోలుపు కు (Political Awakening) ప్రతీక. ఇది రాబోయే బీసీ రాజకీయ సాధికారతకు దిక్సూచి. ఇది తెలంగాణలో బీసీల యుగప్రారంభం నకు సంకేతం
జై బీసీ జై జై బీసీ
టి.చిరంజీవులు
అధ్యక్షులు, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్
Comments
Post a Comment