*పసి బిడ్డను హత్య చేసిన అగ్రకుల దురహంకారులను కఠినంగా శిక్షించాలి*
*విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకు పసిబిడ్డ హత్య కనపడట్లేదా?*
*ఎస్వికే వద్ద కేవిపిఎస్ ప్రజాసంఘాల నిరసన*
*కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*టీ స్కైలాబ్ బాబు*
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆగ్రామ అగ్రకుల పెత్తందారులను కఠినంగా శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు
సోమవారం హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద కేవిపిఎస్ సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు అనంతరం కెవిపిఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో కుల వివక్ష అగ్రకుల దురహంకారానికి రెండు నెలల పసిబిడ్డ హత్యగావించబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మెర గ్రామములో మల్లయ్య జాతరలో అట్టడుగు తరగతులకు ప్రవేశాన్ని అడ్డుకొని వివక్ష పాటించడమే కాకుండా మహిళలని చూడకుండా నానా బూతులు తిట్టి అవమానించారని చెప్పారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్ అనే రజక యువకుడిని మూడున్నర గంటల పాటు ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు ఒక గదిలో నిర్బంధించి చితకబాదారని చెప్పారు తన భర్తను కొట్టొద్దని కాళ్ళ మీద పడి మౌనిక బతిమిలాడి వేడుకున్న కాళ్లతో తన్నారే కానీ కనీసం కనికరించలేదని చెప్పారు.8 మంది అగ్రకుల దురహంకారులు కాళ్లతో తొక్కి పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నారని అత్యంత అమానవీయ క్రూరమైన చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసుల ప్రేక్షక పాత్ర హంతకులను రక్షించే విధంగా ఉందన్నారు బాధితులకు చట్టబద్ధంగా న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితుల పైన అక్రమ కేసులు పెట్టారని నిందితులు ఎనిమిది మంది కాగా కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని మొత్తం హంతకులందరిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు హత్య జరిగితే అటేమ్ టు మర్డర్ కేసు పెట్టడం అన్యాయమైన చర్య అన్నారు పసిబిడ్డ హత్య జరిగింది కాబట్టి హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని 103 సెక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగితే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించాలని ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లకు హంతకులైన శ్రీనివాస్ రెడ్డి మరికొందరు దగ్గర బంధువులు కావడం వల్ల పోలీసులు కేసును నిర్లక్ష్యం చేయడం జరుగుతుందన్నారు.ఎంపీ మల్లు రవి ఈ ఘటనపై ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదని విమర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోవాబన్ అమ్ముకునే అమాయక పేదవాడి పై మత విద్వేషం చిమ్మిన మతోన్మాదులు పసిబిడ్డ హత్య వారి కంటికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మత కొట్లాటలు పెట్టడం తప్ప మానవీయతను గుర్తించలేరని విమర్శించారు అగ్రకుల హిందువులు నిమ్న కుల హిందువులను చంపితే ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాదుల విధానం చంపిన హంతకుల పక్షమేనని వారి చర్య రుజువు చేసిందన్నారు. సీఎం స్వంత జిల్లాలో ఈ దారుణం జరిగితే సీఎం ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు తక్షణమే హంతకులందరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ అనగంటి వెంకటేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నగర కార్యదర్శి బి సుబ్బారావు సిఐటియు నగర ఉపాధ్యక్షులు జి రాములు కెవిపిఎస్ ప్రజా సంఘాల నాయకులు కొమ్ము విజయ్ కుమార్ లక్ష్మీ ఇందిర ఎల్లమ్మ రమేష్ నాగేందర్ ఆంజనేయులు శ్రీనివాస్ అర్జున్ రాంబాబు సోలంకి బీమ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు*
*టీ స్కైలాబ్ బాబు*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేవిపిఎస్ తెలంగాణ
తేదీ 23.02.2026
Comments
Post a Comment