T.Chiranjeevulu IAS(Ret), BCIF(BC Intellectuals Forum)
మూడేళ్లయినా
అమలుకు నోచుకోని కామా రెడ్డి హామీలు - దగాపడ్డ బీసీ లు
(బీసీలకు ఇచ్చిన 21 హామీలు ఏమయ్యాయి? ఇదేనా కాంగ్రెస్ మార్కు హామీల అమలు?)
2023 నవంబర్ 10న కామారెడ్డిలో
కాంగ్రెస్ పార్టీ బీసీలకు 21 ప్రధాన హామీలను ప్రకటించింది.నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయినవి. బీసీల అభ్యున్నతి, ఆర్థిక సాధికారత, విద్యా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ
ప్రాతినిధ్యం వంటి అంశాలపై అనేక వాగ్దానాలు చేసింది. ఆ హామీలను నమ్మిన బీసీ సమాజం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు రాజకీయ మద్దతును అందించింది.
తెలంగాణ అసెంబ్లీ
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విడుదల చేశారు వాటి అమలు తీరును ఒక్కసారి పరిశీలిద్దాం.
I.
హామీలు ఘనం – ఆచరణ శూన్యం
|
నం. |
కామారెడ్డి డిక్లరేషన్ హామీ |
ప్రస్తుత అమలు స్థితి |
|
1 |
ఆరు నెలల్లో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు |
బీసీ సంఘాల డిమాండ్ మేరకు కులగణన , రిజర్వేషన్స్ మాత్రం పెంచ బడ లేదు- పాక్షిక అమలు |
|
2 |
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, ఉపవర్గీకరణ |
42% పెంచ బడ లేదు. అసెంబ్లీ లో బిల్ పాస్ చేసి చేతులు దులుపుకున్నారు కేంద్రం పై చిత్త శుద్దితో పోరాటం లేదు, బీసీ లను మభ్యపెట్టడానికి చెల్లని జీ ఒ ఇచ్చారు. కోర్ట్ అడ్డుకుంది. - అమలుకాలేదు |
|
3 |
ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ |
అమలుకాలేదు, పైసా ఖర్చు కానీ జీ ఓ , కానీ ఇవ్వటానికి మనసు లేదు |
|
4 |
పూలే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత |
అమలుకాలేదు |
|
5 |
ఏటా ₹20,000 కోట్లు, ఐదేళ్లలో ₹1 లక్ష కోట్లు |
అమలుకాలేదు |
|
6 |
ప్రత్యేక MBC మంత్రిత్వ శాఖ |
అమలుకాలేదు |
|
7 |
అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు, ₹10 లక్షల రుణాలు |
కొత్తగా 5 కులాలకు కార్పొరేషన్స్ కానీ ఋణ సౌకర్యం సున్నా- అమలుకాలేదు |
|
8 |
జిల్లా కేంద్రాల్లో ₹50 కోట్లతో బీసీ ఐక్యతా భవనాలు |
అమలుకాలేదు |
|
9 |
ప్రతి మండలంలో బీసీ గురుకులం, ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాల |
అమలుకాలేదు |
|
10 |
అర్హులైన బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ |
అమలుకాలేదు |
|
11 |
ప్రతి మండలంలో 50 దుకాణాలతో వృత్తి బజార్లు |
అమలుకాలేదు |
|
12 |
కులవృత్తిదారుల పింఛను వయస్సు 50 సంవత్సరాలకు తగ్గింపు |
అమలుకాలేదు |
|
13 |
బీసీ సంఘాలకు ఎన్నికలు, ఒక్కో సంఘానికి ₹10 లక్షలు |
అమలుకాలేదు |
|
14 |
ముదిరాజ్, ముత్రాసి, తెనుగోళ్లను BC-Aలో చేర్చడం |
అమలుకాలేదు |
|
15 |
తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు |
అమలుకాలేదు |
|
16 |
అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లో యాదవ, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ |
అమలుకాలేదు |
|
17 |
గౌడ్లకు తాటి తోటలు, సబ్సిడీలు, మద్యం దుకాణాల రిజర్వేషన్ |
అమలుకాలేదు |
|
18 |
మున్నూరు కాపు కార్పొరేషన్యువ పారిశ్రామికులకు సబ్సిడీ ఋణాలు |
పాక్షిక అమలు |
|
19 |
పద్మశాలీలకు మెగా పవర్లూమ్ క్లస్టర్లు |
అమలుకాలేదు |
|
20 |
విశ్వకర్మలకు 90% సబ్సిడీతో పనిముట్ల కిట్లు |
అమలుకాలేదు |
|
21 |
రజకులకు లాండ్రోమాట్లు, ధోబీఘాట్ల ఆధునీకరణ |
అమలుకాలేదు |
21 హామీలలో మునూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు మరియు కుల గణన పాక్షికంగా అమలు, మిగతా 19 హామీలు అమలుకు
నోచుకోలేదు. ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇంత కన్నా బీసీ ల పై వివక్షత
ఏముంటుంది.
II-బీసీ డిక్లరేషన్‌లోని
ప్రధాన హామీ- ఆర్థిక హామీ- బీసీలకు ఏటా ₹20 వేల కోట్ల హామీ.. 5 ఏళ్లలో లక్ష కోట్ల ఖర్చు- ఇది ఉత్తుతి వాగ్ధానమేనని తేలిపోయింది
రాష్ట్ర
బడ్జెట్లో 90 శాతం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బీసీలకు కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా ఎందుకు
ఖర్చు చేయలేకపోయింది? బీసీ లంటే అంత నిర్లక్ష్యమా?
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
గత మూడు ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ వ్యయాలను పరిశీలిస్తే డిక్లరేషన్‌లో ఇచ్చిన
హామీకి, ప్రభుత్వ ఆచరణకు
మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
1. మూడేళ్ల బీసీ బడ్జెట్ కేటాయింపులు
|
ఆర్థిక సంవత్సరం |
బీసీలకు కేటాయింపు |
|
2024–25 |
₹9,200 కోట్లు, |
|
2025–26 |
₹11,405 కోట్లు |
|
2026–27 |
₹12,511 కోట్లు |
|
మొత్తం |
₹33,116 కోట్లు |
మూడేళ్లలో ఏటా ₹20,000 కోట్ల హామీ ప్రకారం ₹60,000 కోట్లు కేటాయించి ఉండాల్సి ఉండగా, కేటాయింపులు ₹33,116 కోట్లకే
పరిమితమయ్యాయి.
అంటే మూడేళ్లలో హామీ ఇచ్చిన మొత్తంతో పోలిస్తే ₹26,884 కోట్లు తక్కువగా
కేటాయించారు. ఖర్చు గత రెండేళ్లలో కేవలం 5140 కోట్లు.
2. కేటాయింపులు వేరు.. వాస్తవ ఖర్చులు వేరు!
బడ్జెట్లో కేటాయింపులు ప్రకటించడం మాత్రమే అభివృద్ధి
కాదు. ఆ నిధులను విడుదల చేసి, పథకాల ద్వారా బీసీలకు వాస్తవంగా ప్రయోజనం చేకూర్చాలి.
మీరు అందించిన వ్యయ గణాంకాల ప్రకారం:
|
ఆర్థిక సంవత్సరం |
కేటాయింపు |
వాస్తవ ఖర్చు |
|
2024–25 |
₹9,200 కోట్లు |
₹2,285.93 కోట్లు |
|
2025–26 |
₹11,405 కోట్లు |
₹2,857.32 కోట్లు |
|
మొత్తం |
₹20,605 కోట్లు |
₹5,143.25 కోట్లు |
ఈ రెండు సంవత్సరాల్లో కేటాయించిన ₹20,605 కోట్లలో ఖర్చు
చేసింది కేవలం ₹5,143.25 కోట్లు మాత్రమే.
అంటే సుమారు 24.96 శాతం మాత్రమే
ఖర్చు చేశారు.
మిగిలిన ₹15,461.75 కోట్లు ఖర్చు చేయలేదు.
ఇక 2026–27 ఆర్థిక సంవత్సరం ఇంకా కొనసాగుతున్నందున దాని తుది వ్యయ గణాంకాలు రావాల్సి
ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంచు మించు ఇదే వ్యయం ఉండ బోతుంది
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బీసీ బడ్జెట్లో 10 శాతం EBCలకు సంబంధించిన కేటాయింపులు కూడా ఉన్నా యి.( మూలం- బడ్జెట్ పుస్తకాలు )
3. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే బీసీల పట్ల నిర్లక్ష్యం మరింత స్పష్టం
ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
|
ఆర్థిక సంవత్సరం |
రాష్ట్ర బడ్జెట్ |
రాష్ట్ర వ్యయం |
|
2024–25 |
₹2.91 లక్షల కోట్లు |
₹2.66 లక్షల కోట్లు |
|
2025–26 |
₹3.04 లక్షల కోట్లు |
₹2.81 లక్షల కోట్లు |
|
మొత్తం |
₹5.95 లక్షల కోట్లు |
₹5.47 లక్షల కోట్లు |
రాష్ట్ర
ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో సుమారు 91.93 శాతం ఖర్చు చేసింది.
మరి అదే ప్రభుత్వం బీసీలకు కేటాయించిన బడ్జెట్లో
కేవలం 24.96 శాతం మాత్రమే
ఎందుకు ఖర్చు చేసింది?
రాష్ట్రంలోని ఇతర శాఖలకు నిధులు ఖర్చు చేయగలిగిన
ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఎందుకు పూర్తిస్థాయిలో
వినియోగించలేకపోయింది?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
4. వెనుకబడిన కులాల అభివృద్ధి ఏమైంది?
బీసీలలోనే అత్యంత వెనుకబడిన కులాలు (MBCs), సంచార జాతులు, విముక్త జాతులు, వృత్తి ఆధారిత
చిన్న కులాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి.
వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ఆర్థిక
సహాయం, ఉపాధి అవకాశాలు
కల్పించాల్సిన అవసరం ఉంది.
కులాలవారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి బడ్జెట్లో కేటాయించిన నిధులు , విడుదల ఖర్చుల
వివరాలు క్రింది పట్టిక లో ఇవ్వ బడినవి
F.Y.2025-26 (మొత్తాలు ₹ కోట్లలో).
|
క్రమ సంఖ్య |
కార్పొరేషన్ పేరు |
కేటాయింపులు |
విడుదల |
ఖర్చు |
|
1 |
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ |
657.00 |
289.07 |
0 |
|
2 |
ఎంబీసీ కార్పొరేషన్ |
400 |
100 |
0 |
|
3 |
రజక కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
4 |
నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
5 |
గీత కార్మికుల కార్పొరేషన్ |
68 |
34 |
17 |
|
6 |
వడ్డెర కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
7 |
సగర (ఉప్పర) కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
8 |
వాల్మీకి–బోయ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
9 |
కృష్ణ బలిజ–పూసల కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
10 |
బట్రాజ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
11 |
కుమ్మరి కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
12 |
మేదరి కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
13 |
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
14 |
ముదిరాజ్ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
15 |
యాదవ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
16 |
కుర్మ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
17 |
మున్నూరు కాపు కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
18 |
పద్మశాలి కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
19 |
పెరిక కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
20 |
లింగాయత్ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
21 |
మేర కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
22 |
గంగపుత్ర కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
|
23 |
ఈబీసీ కార్పొరేషన్ |
50 |
12.50 |
0 |
మొత్తం 2125.00 707.07 17.00
ఇతర ఆర్థిక కేటాయింపులు
|
పథకం పేరు |
కేటాయింపులు (₹ కోట్లు) |
విడుదల (₹ కోట్లు) |
ఖర్చు (₹ కోట్లు) |
|
రాజీవ్ యువ వికాసం |
1,800 |
0 |
0 |
గత సంవత్సరం కూడా బీసీ కార్పొరేషన్లకు/ఫెడరేషన్స్ కు ఇవే
కేటాయింపులు, ఖర్చు సున్నా. గత B.R.S. ప్రభుత్వం కూడా
ఇదే నిర్లక్ష్యం. అందుకే తగిన మూల్యం చెల్లించుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 ఏళ్లుగా ఆధిపత్య కుల పాలకులు బీసీ లను అన్ని
రంగాలలో అణగ ద్రొక్కుతున్నారు.
5. బీసీ సమాజం ప్రభుత్వాన్ని నిలదీయాలి!
బీసీ లు ఆర్థికంగా
అభివృద్ధి కావద్ద?, కేవలం వారు ప్రభుత్వ సబ్సిడీల మీదనే బతుకాలా ? ఇదేనా ఆధిపత్య కుల
ప్రభుత్వాల వైఖరి.బీసీల జనాభా 56 శాతానికి పైగా
ఉన్న రాష్ట్రంలో వారి ఆర్థికాభివృద్ధికి తగిన నిధులు ఖర్చు చేయకుండా ఉంటే బీసీల అభివృద్ధి ఎలా
సాధ్యమవుతుంది
లక్షల కోట్లతో
సాగు నీటి ప్రాజెక్టులు, మూసి అభివృద్ధి, మెట్రో రైల్, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కూల్ భవనాల నిర్మాణం చేపట్టుతున్న మీకు బీసీ లకు
ఇవ్వటానికి మాత్రమే డబ్బులు
కరువైనయ?
అని బీసీ సమాజం ప్రశ్నిస్తుంది . ? కామారెడ్డి బీసీ
డిక్లరేషన్ కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పత్రంగా మిగిలిపోకూడదు. ఈ
హామీ బీసీ సమాజానికి ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయ వాగ్దానం
III. స్థానిక సంస్థలు, విద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు - మోసపూరిత వైఖరి
రాష్ట్ర ప్రభుత్వ
నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత! కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి మూడేళ్లు
కావస్తున్నా ఆ హామీని నెరవేర్చలేకపోయింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి
వల్ల న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే కారణంతో బీసీ సంఘాల డిమాండ్ మేరకు సంబంధిత
బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం
చేతులు దులుపుకుంది. వాటి ఆమోదం కోసం కేంద్రంపై
ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకరోజు ధర్నా
చేస్తే సరిపోతుందా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించారా? అఖిల పక్షాన్ని ఢిల్లీ కి
తీసుకెళ్లర?మాట్లాడితే 50% సీలింగ్ బద్దలు
కొట్టుతామని పలికే రాహుల్ గాంధీ
పార్లమెంట్ లొ ఈ విషయాన్ని ప్రస్తావించారా? 50 శాతం రిజర్వేషన్ల
పరిమితిని బద్దలు కొడతామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ బీసీలకు ఇచ్చిన
హామీ అమలులో ఎందుకు చొరవ చూపడం లేదు? ఇది మోసపూరిత వైఖరి కదా? హామీ ఇచ్చినప్పుడు న్యాయ పరమైన సమస్యలుంటాయని వారికి తెలియద ? రాష్ట్ర ప్రభుత్వ
నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ
ఉదాసీనత మధ్య బీసీ నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే ఈ
మధ్య బీసీ యువత ఆత్మ హత్యలకు పాల్పుడుతున్న ఘటనలు మళ్లి పునరావృతమవుతున్నవి .
IV- రాజకీయ రంగములో, నామినేటెడ్ పోస్ట్ ల
లో కూడా తీవ్రమైన అన్యాయం.
గత మూడేళ్ల కాంగ్రెస్
పాలనలో బీసీలు రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. నామినేటెడ్, కార్పొరేషన్ చైర్మన్
పదవుల్లో నామమాత్రపు ప్రాతినిధ్యమే కల్పించారు.
అసెంబ్లీ లో బీసీ ల
సంఖ్య అసలే తక్కువ. కనీసం అత్యంత వెనుకబడిన వర్గాలకు నామినేటెడ్ ఎమ్మెల్సీ ల లైన ఇవ్వాలని సోయి లేదు వీరికి.
చట్ట సభ ల లో అంత ఆధిపత్య కులాలే. ఈ మధ్య రెండు
ఎమ్మెల్సీ పదవులనూ ఆధిపత్య కులాలకే కేటాయించగా, మంత్రివర్గంలో సైతం బీసీలను
ఇద్దరికే పరిమితం చేశారు. తెలంగాణలో బలంగా సాగుతున్న బీసీ ఉద్యమాన్ని సైతం
ప్రభుత్వం పట్టించుకోకపోవడంలేదు. ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, అధికారంలోనూ బీసీలకు జనాభా
దామాషా ప్రకారం వాటా కల్పించాలి.
V-
కాంగ్రెస్ ప్రభుత్వం
ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, వారికి
ఇచ్చిన హామీల అమలులో విఫలమవడం తీవ్రమైన తప్పిదం. రాజకీయ అవసరాల కోసం హామీలిచ్చి, అధికారంలోకి
వచ్చాక విస్మరిస్తే బీసీ సమాజం మౌనంగా ఉండదు.
మూడు సంవత్సరాల పాలన
తర్వాత కూడా బీసీలు తమ హక్కుల కోసం రోడ్లపైకి రావాల్సి రావడం వారి వైఫల్యం కాదు; ప్రభుత్వమే
సృష్టించిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో బీసీలు కేవలం ఓటర్లు కాదు, అధికారంలో
సముచిత వాటా కోరే హక్కుదారులు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇచ్చిన
హామీలను విస్మరిస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గతం
లో బీసీ ల కు వ్యతిరేకముగా పనిచేసిన B.R.S.
ప్రభుత్వంను ప్రజలు ఎక్కడ కుర్చోబెట్టారొ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బీసీ ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి.
ఈ ఆధిపత్య కులాల పాలన లో మనకు న్యాయం
జరగదు.మన ఓట్లతో మన రాజ్యం తెచ్చు
కోవాల్సిందే. అందుకు మనం సంసిద్ధం కావాల్సిందే.
Comments
Post a Comment