ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ ప్రజలు ఒక్కసారి చరిత్రను పునఃసమీక్షించాలి.
2018లో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో సెక్షన్ 9 ప్రకారం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. ఆ తర్వాత జూన్ 2018లో జీఓ నం.396 జారీ చేసి స్థానిక సంస్థలన్నింటిలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుచేయాలనింది. అయితే దీనిపై హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి పోతున్నాయని పేర్కొంటూ ఈ జీఓను కొట్టేసింది.
దీనిపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనక్కి తీసుకుని, ఆర్డినెన్స్ 2/2018 జారీ చేసి బీసీలకు 22% రిజర్వేషన్ మాత్రమే కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.
ఇప్పుడు మళ్లీ అదే ప్రయోగాన్ని మరోసారి చేయాలని ప్రభుత్వం యత్నిస్తుంది. కానీ ఈ 42% రిజర్వేషన్ నిర్ణయం పునర్విచారణకు లోనవుతుంది. గత అనుభవాల ప్రకారం, ఇది న్యాయపరంగా నిలవబోదనే అభిప్రాయం న్యాయవాదులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే బీసీ ప్రజలు మళ్ళీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో బీసీలను ఆకర్షించేందుకు తాత్కాలికంగా తీసుకువచ్చే ఈ విధమైన ఆర్డినెన్సులు కోర్టులో నిలవవు. నిజమైన బీసీ సంక్షేమం, రాజకీయం పరిరక్షించాలంటే 9 వ షెడ్యూల్ మాత్రమే శరణ్యం
టి . చిరంజీవులు
చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్
Comments
Post a Comment