*1906 జూలై 26 న మూలనివాసీ(SC,ST,0BC) ప్రజలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఛత్రపతి సాహూ మహారాజ్...
*ఈ సందర్భంగా మిత్రులందరికీ రిజర్వేషన్ల దినోత్సవ శుభాకాంక్షలు...💐💐
1894 లో చత్రపతి సాహూ మహరాజ్ గారు మహారాష్ట్ర లోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు.
చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ మహారాజ్ గారు నిజానికి జాతీయోద్యమం, బ్రాహ్మణ సంస్కృతిని ఆచరించి ఉండవలసింది. కానీ అందుకు భిన్నంగా అతను మహాత్మా పూలే నిర్వహించిన సత్యశోధక ఉధ్యమ వారసత్వాన్ని ఎన్నుకున్నాడు.
తన సంస్థానంలో విద్య, వైద్యం, పోలీసు, న్యాయవ్యవహారాలు, రెవెన్యూవంటి శాఖల ప్రత్యేక విభాగాలకు పరివేక్షణ అధికారులంతా బ్రాహ్మణలచే నిండి ఉండేది. డాక్టర్లు, బారిస్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు ఉన్నతస్థానాలన్ని బ్రాహ్మణనులే ఆక్రమించారు. ఇలా సామాజిక, పాలనా రంగాలలో బ్రాహ్మణధిక్యత పెరగటం వలన హిందూ పిఠాధిపతుల వైఖరిలో మార్పు వచ్చింది. జగద్గురు శంకరాచార్య పీఠం కూడా ఆధ్యాత్మిక వ్యవహారాల కన్నా రాజకీయ విషయాలకే ప్రాధాన్యత నిచ్చాడు. ఇలాంటి శక్తులను బ్రిటీష్ ప్రభుత్వం అదుపు చెయ్యటానికి ఏమాత్రం ప్రయత్నంచలేదు.
మరాఠ వంశం నుండి వచ్చన సాహూ మహారాజ్ గారు ఈ సమస్యను బాగా అర్ధంచేసుకున్నాడు. మరాఠాలను, ఇతర బ్రాహ్మణనేతరులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకోస్తే తప్ప, వాళ్ళ సామాజిక హోదాలో మార్పు రాదని భావించిన చత్రపతి సాహూ మహారాజ్ గారికి సమస్యకు మూలం ఎక్కడుందో అర్ధమైంది. పదవులకు అవసరమైన విద్యా అర్హతలు బ్రాహ్మనేతరులకు బొత్తిగా లేవు. ముందుగా వాళ్ళకు ఆధునిక విద్యావిధానంలో ప్రవేశం కల్పిస్తే తప్ప ఉద్యోగాలు యివ్వడం వీలుపడదు. వెంటనే వెనుకబడిన కులాల పిల్లల కోసం స్కూళ్ళు, హాస్టళ్ళను ప్రారంభించాడు. దీంతో బ్రాహ్మణలు గగ్గోలు పెట్టారు. రాజభవనంలో అన్ని కార్యక్రమాలు రాజ పురోహిత పౌరాణిక విధానంలో నిర్వహించడాన్ని సాహు అడ్డుకుని వేదోక్తకంగా నిర్వహించాలని ఆదేశించాడు. శూద్రులకు వేదోక్తంగా విధులను నిర్వహించడం శాస్త్ర విరుద్ధమని తెగేసి చెప్పారు పురోహితులు. వారి ఉద్యోగాలను పికేసినా వారి భూములను సాహూ మహారాజ్ గారు లాక్కున్నా బ్రహ్మణులు సాహూ మహారాజ్ గారిని ఖాతరు చేయలేదు. పైగా సాహూ మహారాజ్ గారిపై బ్రిటిష్ ప్రభుత్వానికి పిర్యాదులు చేశారు. జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ కూడా సాహూ మహారాజ్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. బ్రిటీష్ ప్రభుత్వం బ్రాహ్మణ పురోహితులకు - సాహూ మహారాజ్ గారికి మధ్య సమాధానం కుదిర్చి ఇకపై చత్రపతి సాహూ మహరాజ్ గారికి వైదిక కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణుల భూములను తిరిగి ఇచ్చివేయాలని తీర్పు చెప్పింది. దీనితో బ్రాహ్మనేతరులు సామాజికంగా ఎంత వెనుకబడి ఉన్నారో సాహూ మహారాజ్ గారికి మరింత అర్ధం అయింది. ఈ అవగాహన ఆయనను గొప్ప సామాజిక సంస్కర్తగా తీర్చిదిద్దింది.
సాహూ మహారాజ్ గారు చేపట్టిన సామాజిక సంస్కరణలు : వెనుక బడిన కులాల పిల్లలకు ఉచిత విద్యావకాశాలు, హాస్టల్ వసతి కల్పించడం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, వ్యవసాయ దారులకు ప్రత్యేక సౌకర్యాలు, సామాజిక దురాచారాల నిర్మూలనకు చట్టాల రూపకల్పన, అస్పృశ్యత నివారణ, వెట్టి చాకిరిరద్దు, తరతరాల నుండి వంశపారంపర్యంగా బ్రాహ్మణులు అనుభవిస్తున్న కులకర్ని పదవుల రద్దు యిలా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రామాలు చేపట్టి భారత దేశంలోనే విలక్షణమైన ప్రజాపాలకుడిగా పేరు గాంచాడు.
సాహూ మహారాజ్ గారు వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ప్రకటించిన మొట్ట మొదటి పాలకుడు. ఆ తరువాత 1918లో మైసూర్ లోనూ, 1921లో మద్రాస్ లోనూ, 1925లో బొంబాయి లోనూ రిజర్వేషన్లు ప్రారంభమైనాయి. ఆ విధంగా సాహూ మహారాజ్ గారు భారత రాజ్యాంగానికి స్పూర్తినిచ్చాడు.
చత్రపతి సాహూ మహారాజ్ గారికి
జై భీమ్లు✊
Comments
Post a Comment