బీసీల అవకాశాలు, అభివృద్ధి విషయంలో, నటించడం తప్ప బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఏమాత్రమైనా ఉందా ? ఏమాత్రం లేదు
బీసీల అవకాశాలు, అభివృద్ధి విషయంలో, నటించడం తప్ప బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఏమాత్రమైనా ఉందా ? ఏమాత్రం లేదు.
-------------------------------------------
1. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు గారు, "చాణిక్యం" మా గుత్తాధిపత్యం అనే ధోరణి లో, 42% స్థానిక సంస్థల్లో, బీసీ రిజర్వేషన్ల విషయంలో, "ముస్లింల" కుంటి సాకు చూపి ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారు. బీసీల సానుభూతి పరులు గా నటిస్తున్నారు. బీజేపీకి బీసీల దామాషా అవకాశాల విషయంలో, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గత 11 సంవత్సరాల మీ పాలనలో, ఏ ఒక్క సందర్భం లోనైనా దాన్ని నిరూపించు కో గలిగారా ?
కేవలం కొంతమందికి కొన్ని స్వతంత్రం లేని పదవులు ఇచ్చినంత మాత్రాన, బీసీల అభ్యున్నతికి ఇవి ఏ విధంగా నైనా, ఏమాత్రం మైనా ఉపయోగ పడుతున్నాయా ?
ఇటువంటి పదవుల ద్వారా బీసీలకు జరిగిన ప్రయోజనం ఏమిటో, చెప్పి నిరూపించండి.
పొన్నం, లేదా మహేష్ గౌడును సీయం చేయాలంటున్న రామచంద్ర రావు గారు, మరి స్థానిక సంస్థల్లో బీసీల 42% రిజర్వేషన్, నీరు కారేటట్లు ఎందుకు చాణిక్యం చేస్తున్నట్లు ?
2. మహిళా రిజర్వేషన్ చట్టం లో, బీసీ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడినట్లు ? స్వంత శక్తితో బీసీ మహిళలు తమ దామాషా అవకాశాలను స్థానిక సంస్థల్లో సాధించగలిగే పరిస్థితి ఉందా ? లేదు కదా ? ఆధిపత్య కులాల మహిళలకే ఆ పరిస్థితి లేనప్పుడు, బీసీ మహిళలకు ఎలా ఉంటుంది ? ఇది బీసీల మీద ప్రభుత్వ చాణిక్య ప్రదర్శన కాదు, అని రామచంద్ర రావు గారు చెప్ప గలరా ? అది వీలు కాదు.
3. బీజేపీ ప్రభుత్వం సవరించిన కార్మిక చట్టాలను ప్రయోగించి, కార్మికుల రక్షణ ను అన్ని విధాలా కాలరాస్తూ, వారిపై అధిక పని గంటల ఒత్తిడిని పెంచి, వారికి దొరక వలసిన రక్షణను అనేక విధాలుగా నీరు కారుస్తూ, యాజమాన్యాల దోపిడీని పెంచే విధంగా మార్పులు తేవడం కార్మికుల్ని వేధించడం కాదా ? మరి "ఈ కార్మికుల్లో" అత్యధికులు బీసీలు, ఎస్సీలు కాదా ? బడుగు వర్గాల మీద బీజేపీ ప్రభుత్వం చూపిస్తుంది అభిమాన మా, లేక పూర్తిగా అక్కసా ?
4. అన్ని రంగాల్లో నూ , బీసీలకు దామాషా అవకాశాలు తక్కాలి కదా ? బీసీల అభివృద్ధి అంటే మాకు ఎంతో ప్రేమ అని ప్రచారం చేసుకొనే బీజేపీ ప్రభుత్వం, చట్టసభల్లో ను, స్థానిక సంస్థల్లో ను, రాజ్యాంగ సవరణల ద్వారా దామాషా అవకాశాలు కల్పించే విధంగా, ప్రభుత్వం ఎందుకు ముందు అడుగు వేయలేక పోతుంది ?
5. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న బలహీన వర్గాలను ఇంకా వేధించ డానికి కాకపోతే, లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ?
6. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో బీసీలకు దామాషా అవకాశాలు దొరకడం లేదు కదా ! అందుచేత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి, వారి రిజర్వేషన్ తమిళ నాట కొనసాగుతున్నట్లు, 50% వరకు పెంచాలని ఎందుకు ప్రభుత్వం ఆలోచించ లేక పోతుంది ? రిజర్వేషన్ సీలింగ్ ఎందుకు తొలగించ కూడదు ? బీసీలకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ తీసుకు రావచ్చు కదా ?
7. డెడికేటెడ్ కమిషన్ నివేదిక మేరకు అమలు పరచబడే, "మతానికి, కులానికి" అతీతంగా, కేవలం "రాజకీయ వెనుక బాటు తనం" ఆధారంగా మాత్రమే ఇవ్వ వలసిన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, విషయంలో న్యాయ వాది కూడా అయిన రామచంద్ర రావు గారు, ముస్లింల ప్రస్తావన తీసుకు రావడం, సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించే "చాణిక్యం" కాదా ? బీసీలకు మేలు చేయక పోయినా ఫర్వాలేదు, ద్రోహం చేయవద్దు అని బీసీలు బీజేపీ, వారి పరివారాన్ని అర్ధిస్తున్నా రు. మనసారా కోరుతున్నారు.
-- కొండలరావు, కె.
న్యాయ వాది, బీసీ వాది
26-7-2025
Comments
Post a Comment