T. Chiranjeevulu, IAS Ret
తెలంగాణలో ప్రైవేట్ వైద్యరంగం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులు వనరుల కొరత, సిబ్బంది లోపంతో సమర్థవంతంగా సేవలు అందించలేకపోతుండగా, ప్రైవేట్ ఆసుపత్రులు అనియంత్రితంగా విస్తరిస్తూ, ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చాయి. అధిక ఫీజులు, అనవసర పరీక్షలు, కఠినమైన బిల్లింగ్ విధానాలతో సామాన్యులు దోపిడీకి గురవుతున్నారు.
1. డేటా & స్థితిగతులు
- తెలంగాణలో: 1000+ మల్టీ-స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రులు, 4000 క్లినిక్స్, 500 డయాగ్నస్టిక్ సెంటర్లు.
- హైదరాబాద్‌లో: 165+ కార్పొరేట్ ఆసుపత్రులు, 12,000 బెడ్స్‌తో సూపర్-స్పెషాలిటీ సేవలు.
- ప్రభుత్వ రంగం: 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 26 టీచింగ్ హాస్పిటల్స్, 72 ఏరియా హాస్పిటల్స్, 97 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 82 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 4745 హెల్త్ సబ్-సెంటర్లు, 4 ESI హాస్పిటల్స్, 14 స్పెషలైజ్డ్ హాస్పిటల్స్.
- NSSO సర్వే (75వ రౌండ్): గ్రామీణ ప్రాంతాల్లో 75.1%, పట్టణ ప్రాంతాల్లో 81.7% హాస్పిటలైజేషన్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతోంది. మొత్తంగా 78% చికిత్సలు, 83% సర్జరీలు ప్రైవేట్ రంగంలో జరుగుతున్నాయి.
- ఖర్చులు: సాధారణ డెలివరీకి ₹60,000–₹1,50,000, సిజేరియన్‌కు ₹2 లక్షల వరకు. కోవిడ్ సమయంలో ICU బెడ్ చార్జీలు రోజుకు ₹1 లక్ష వరకు. కేన్సర్, కిడ్నీ, గుండె శస్త్రచికిత్సలు కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయి.
- వ్యాపారం: ప్రైవేట్ ఆసుపత్రులు వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి.
- నియంత్రణలు: Clinical Establishments Act ఉన్నప్పటికీ, అమలు బలహీనం. ప్రైవేట్ ఆసుపత్రుల లాబీలు, లాయర్లు, అధికారులపై ప్రభావం చూపుతూ రోగులకు న్యాయం అందకుండా చేస్తున్నాయి.
- యాజమాన్యం: ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు ఎక్కువగా వెలమ, రెడ్డి, కమ్మ కులాల చేతిలో ఉన్నాయి. ఈ కులాలు ఆరోగ్య రంగాన్ని స్వాధీనం చేసుకొని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దోపిడీకి పాల్పడుతున్నాయి.
- ఉదాహరణలు:
- అపోలో హాస్పిటల్స్ – ప్రతాప సి రెడ్డి (రెడ్డి)
- యశోద హాస్పిటల్ – జి రవీందర్‌రావు (వెలమ)
- కిమ్స్ – బొల్లినేని భాస్కరరావు (కమ్మ)
- కాంటినెంటల్ – గురు ఎన్ రెడ్డి (రెడ్డి)
- బహుజనులు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారు, కానీ అధిక ఫీజుల వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆస్తులు అమ్ముకోవడం లేదా చికిత్స వదిలేయడం జరుగుతోంది.
- “వైద్యో నారాయణ హరి” అనే భావన అంతరించి, ఆరోగ్యం వ్యాపారంగా మారింది.
- ప్రైవేట్ ఆసుపత్రులకు నామమాత్ర ధరలకు భూములు, సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నప్పటికీ, సామాన్యులకు తక్కువ ధరలకు సేవలు అందించడం దాదాపు శూన్యం.
- ప్రైవేట్ మెడికల్ కళాశాలలు: తెలంగాణలో 26 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఎక్కువగా రెడ్డి (7), వెలమ (5), కమ్మ (4) యాజమాన్యంలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల యాజమాన్యం శూన్యం.
- ఫీజులు: 30% యాజమాన్య కోటా (15% బీ కేటగిరి, 15% ఎన్ఆర్ఐ కోటా) సీట్లను అధిక ధరలకు విక్రయిస్తూ వేల కోట్లు గడిస్తున్నారు. సామాన్యులు అప్పులు చేసి లేదా ఆస్తులు అమ్మి విద్య అందించాల్సి వస్తోంది.
- ఆరోగ్య హక్కు చట్టం: ప్రైవేట్ ఆసుపత్రుల ఛార్జీలను నియంత్రించాలి.
- ప్రభుత్వ రంగం బలోపేతం: జిల్లా స్థాయిలో సూపర్-స్పెషాలిటీ సేవలు, ప్రాథమిక, ద్వితీయ హెల్త్‌కేర్‌ను పటిష్ఠం చేయాలి.
- కఠిన చర్యలు: నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి.
- సామాజిక జాగృతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులు రాజకీయ శక్తితో ఈ దోపిడీకి చెక్ పెట్టాలి.
Comments
Post a Comment