బీసీల నోటికాడబుక్క లాక్కుంటున్నారు
- తీర్పులు రాకముందే కుట్రలు చేస్తున్నారు
- బీసీ లకు రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ఆధిపత్య కులాలు
తరతరాలుగా బీసీల ఎదుగుదలను బీసీల రిజర్వేషన్లు సహించని ఆధిపత్య కులాలు బీసీల నోటికాడ బుక్కలు లాక్కుంటున్నారని బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు మరియు బి బాలరాజు గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆవేదన వ్యక్తం చేశారు .సోమవారం నాడు బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించ వద్దంటూ గోరేటి వెంకటేష్ మరియు వి మాధవరెడ్డి హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ నంబర్ 30218/2025 పై టి టి.చిరంజీవులు మరియు బాలరాజు గౌడ్ గారు ఇంప్లైడ్ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్సు ఫోరం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్లను అందకుండా అగ్రకులాలు అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసే అడ్డుకుంటున్నాయని టీ చిరంజీవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీలకు ప్రభుత్వము 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఓర్వలేక కోర్టులను ఆశ్రయించి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు .హైకోర్టులో రిట్ పిటిషన్ పై సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ద్వారా టీ చిరంజీవులు మరియు బి బాలరాజు గౌడ్ తరఫున ఇంప్లైడ్ అయ్యినట్లు వారు విడుదల చేసిన ప్రకటన లో తెలిపారు.గతంలో 34 శాతం రిజర్వేషన్లను కూడా అడ్డుకునేందుకు అగ్ర కులాలు కుట్రలు చేశాయని అన్నారు.
2011 సంవత్సరంలో రిట్ పిటిషన్ నెంబర్ 16560/ 2011 ద్వారా టి వెంకట్ రమణారెడ్డి, రిట్ పిటిషన్ నెంబర్ 16473 /2011 ద్వారా ఎం వెంకటరెడ్డి
31964/20 11 ద్వారా జి చంద్రశేఖర్ రెడ్డి34% బీసీ రిజర్వేషన్లను హైకోర్టులో కేసులు వేసి వేసి కొట్టేయించారని తెలిపారు. దీనిపై అప్పటి ప్రముఖ బీసీ ఉద్యమ నేత పి. వినయ్ కుమార్ సుప్రీంకోర్టు కెళ్ళి 34 శాతం రిజర్వేషన్లు తెచ్చాడని గుర్తు చేశారు .2018 వ సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన 396 జీవోను తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపు సత్యనారాయణ రెడ్డి. రిట్ పిటిషన్ 21725/ 2018 వి స్వప్న రెడ్డి పిటిషన్ నెంబర్ 21902 /2018 ద్వారా 34 శాతం రిజర్వేషన్లు కొట్టేయించి తగ్గించారని ప్రకటన లో వివరించారు.
గతంలో హైకోర్టుల ద్వారా జీవోలు కొట్టేయించిన అగ్రకులాలు ప్రస్తుతం హైకోర్టులలొ కేసు లు
విచారణకు రాకముందే, జడ్జిమెంట్లు రాకముందే ఓర్వలేని తనంతో వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించి బీసీలను రాజకీయ రంగంలో అణిచివేసే దుర్బుద్ధితో ఈ కుట్రలకు తెరతీసారని అన్నారు. ప్రస్తుతం బీసీలు ఎంతో కొంత చైతన్యవంతమయ్యారని ఇప్పుడు కోర్టులలో తిప్పికొడతామని భవిష్యత్తులో ఓట్ల ద్వారా కూడా తగిన గుణపాఠం అగ్రకులాలకు చెప్తామని వారు హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో చైర్మన్ టి.చిరంజీవులు తోపాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు కె.వి గౌడ్ ,dr అవ్వారు వేణు కుమార్ ,చెన్నా శ్రీకాంత్ ,వేముల కొండల గౌడ్,బైరి శేఖర్,లింగేష్ యాదవ్,బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు దుర్గయ్య గౌడ్ ,అయిలి వెంకన్న గౌడ్ ,నగేష్ తదితరులు ఉన్నారు .
Comments
Post a Comment