సాయి ఈశ్వర చారి ఆత్మబలిదాన ప్రయత్నం – బాధాకరమైనది… ఇటువంటివి ఇక ఎన్నడూ పునరావృతం కాకూడదు
T. Chiranjeevulu IAS (Ret)
నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ మోసం చేశాయన్న బాధతో నిన్న ఫిర్యాదుగూడలో ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర చారి తమ్ముడి ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఈ దుఃఖద ఘటనపై నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.మన హక్కుల కోసం పోరాడుతున్న బీసీ-బహుజన యువత ఇలాంటి చరమ చర్యలకు పాల్పడటం సమాజానికే శాపం.
తెలంగాణ సాధనలో 1200 మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల బిడ్డలు ప్రాణాలర్పించారు.ఇక చాలు.
ఇక నుంచి బలిదానాలు కాదు – పోరాటమే మార్గం!మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన గౌరవం…
ఆత్మహత్యలతో రావు – ఐక్యత, రాజకీయ చైతన్యం, సంఘటిత శక్తితోనే సాధ్యం.నా బీసీ-బహుజన బిడ్డలందరికీ గట్టి పిలుపు:
ఆత్మహత్య మార్గం కాదు – పోరాటమే మార్గం!
లక్ష్యం సాధించాలంటే బలంగా, చైతన్యవంతంగా, ఒక్కటిగా నిలబడాలి!సాయి ఈశ్వర చారి తమ్ముడు త్వరగా కోలుకొని, మరింత ధైర్యంతో, కొత్త సంకల్పంతో జీవితంలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సంఘటన మనందరికీ గట్టి హెచ్చరిక.
ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయొద్దు.మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది –
ఓటు ద్వారా, ఆత్మగౌరవం ద్వారా, సంఘటిత పోరాటం ద్వారా నిర్మించుకుందాం.
హిస్సా
ఇజ్జత్
హుకుమత్ 
అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం!మన హక్కుల కోసం వేడుకోవద్దు – పోరాటం ద్వారా సాధించుకుందాం.
అది ప్రాణత్యాగాలతో కాదు… నిస్వార్థ రాజకీయ సంకల్పంతోనే!తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు –
పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలి!మనల్ని మోసం చేసిన వారికి ఓటే సమాధానం.ఫూలే
అంబేడ్కర్
కాన్షీరాం ఆశయాన్ని సాధించుకుందాం
అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం!మన హక్కుల కోసం వేడుకోవద్దు – పోరాటం ద్వారా సాధించుకుందాం.
అది ప్రాణత్యాగాలతో కాదు… నిస్వార్థ రాజకీయ సంకల్పంతోనే!తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు –
పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలి!మనల్ని మోసం చేసిన వారికి ఓటే సమాధానం.ఫూలే
చూపిన మార్గంలో నడుద్దాం…చివరి మాట:
“ప్రాణం వి�లువైనది – పోతే తిరిగి రాదు.
పోరాటం పవిత్రమైనది – కానీ ఆత్మబలిదానం దానికి మార్గం కాదు.”జై ఫూలే
జై అంబేడ్కర్
జై బహుజన్
“ప్రాణం వి�లువైనది – పోతే తిరిగి రాదు.
పోరాటం పవిత్రమైనది – కానీ ఆత్మబలిదానం దానికి మార్గం కాదు.”జై ఫూలే
Comments
Post a Comment