#ఇక_ఓటు_అమ్మేదికాదు – #అధికారం_తెచ్చేది
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో బీసీ ఓటరు మహాశయులారా!
బీసీ అభ్యర్థులనే సర్పంచ్ గా గెలిపించండి – ఇది ఒక సాధారణ ఎన్నిక కాదు, గ్రామంలో బీసీ సర్పంచ్ గెలుపు బీసీల స్వాభిమాన పోరాటానికి విజయ సూచిక.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దము గడుస్తున్నా గ్రామాలలో బీసీలు ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ, నాయకత్వం మాత్రం ఇతర ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉందనే విషయం ఇప్పుడు బీసీ సమాజం గ్రహించాల్సిన సమయం ఇది.
ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. బీసీలు రాజ్యాధికారం సాధించడానికి బలమైన నాయకత్వం అవసరం ఉంది. కావున ఈ సర్పంచ్ ఎన్నికలు బీసీలకు నాయకత్వం రావాలా? లేక బీసీలు ఓటుగా మాత్రమే మిగలాలా? అని నిర్ణయించే ఎన్నికలు అని గ్రహించండి.
ఎందుకు బీసీ సర్పంచ్ గెలవాలి?
✔️ గ్రామ పంచాయతీ బడ్జెట్లు వీరి చేతిలోనే ఉంటాయి,
✔️ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఎవరి వద్దకు వెళ్లాలన్న,
✔️ గ్రామంలో ఉద్యోగాలు, పథకాలు ఎవరికీ అందించాలన్న,
✔️ సమాజంలో గౌరవం, నిర్ణయం, శక్తి అన్ని సర్పంచ్ ఎవరు అన్నదే నిర్ణయిస్తుంది.
బీసీలు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అధిపత్య కులాలకు నాయకత్వం లభించడం చాలా ఏళ్లగ జరుగుతున్న తంతు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే సమయం ఇది. అధికారం ఉన్న చోటే గౌరవం ఉంటుంది, సంపదపై పెత్తనం ఉంటుంది.
అధిపత్య కులాలు ఓటు అడుగుతారు, చేతులు కలుపుతారు, మాయ మాటలు చెబుతారు. కానీ ఓటు పొంది కుర్చీ ఎక్కిన తర్వాత బీసీలను పట్టించుకునే పరిస్థితి ఉండదు.
అందుకే ఈసారి ఓటు డబ్బు పంచేవారికో, సారా పొసే వారికో, బిర్యానీ పెట్టిన వారికో వేసేది కాదు అని అర్ధం చేసుకుని, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. ఈ బలమైన సాదానంతో మన బతుకులు మారుకుందాం.
ఆధిపత్య కులాలకు వేసే మన ప్రతి ఓటు మన బానిసత్వము పటిష్టతకు వేసే పునాదే.
గ్రామాలు బీసీలతో నిండివున్నప్పుడు… సర్పంచ్ కుర్చీ కూడా బీసీల దే కావాలి.
“మన గ్రామంలో మనమే మెజారిటీ…
కానీ అధికారం మాత్రం మన చేతుల్లో లేకపోతే, ఇది మన తప్పు, మనము చేస్తున్న పొరపాటు.”
అందుకే
ఈసారి తెలంగాణా లో సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ అభ్యర్థులనే గెలిపించండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సహకారంతో సర్పంచ్ సీట్లు గెలవండి. బహుజన వాదాన్ని బలపర్చండి, గెలిపించండి, పరస్పరం సహకరించుకోండి.
ఇస్సా – ఇజ్జత్ - హుకుమత్ (Power) మన చేతికి తీసుకురండి.
బీసీ ఓటు – బీసీ అభ్యర్థికే.
ఇది ఒక అభ్యర్థిని గెలిపించడం కాదు — బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్మించడం.
మన హక్కులు కొరకు ఆధిపత్య కులాలను యాచించకుండా ఉండాలంన్నా,
మన హక్కులు మన చేతుల్లో ఉండాలంన్నా…
గ్రామ స్థాయిలోనే నాయకత్వం బీసీలకు రావాలి.
జై ఫూలే, జై భీమ్, జై బీసీ సర్పంచ్,
టి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ మరియు బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్
Comments
Post a Comment